Begin typing your search above and press return to search.
జనసేనకు గాజువాకలో గట్టి షాక్..'కరణం' గుడ్ బై!
By: Tupaki Desk | 12 Feb 2020 12:15 PM GMTజనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి ఈ మధ్య వరుసగా షాకుల మీద షాకులు తగులుతున్నాయి. పవన్ కళ్యాణ్ ఒకవైపు వచ్చే ఎన్నికలలోపు పార్టీని మరింత బలంగా తయారుచేయాలని ప్రయత్నాలు చేస్తుంటే ..మరోవైపు జనసేన నుండి ఒక్కొక్కరుగా కీలకనేతలందరూ బయటకి వచ్చేస్తున్నారు. ఈ మద్యే సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ జనసేన కి గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. పవన్ కల్యాణ్ మళ్లీ సినిమాల్లో నటిస్తున్నందుకు నిరసనగా జనసేన పార్టీ నుంచి ఆయన బయటకు వచ్చారు. తాజాగా మరో సీనియర్ నేత జనసేనకు గుడ్ బై చెప్పారు.
జనసేనాని పోటీచేసిన గాజువాక నియోజకవర్గానికి చెందిన సీనియర్ నేత కరణం కనకారావు పార్టీని వీడారు. బుధవారం పార్టీకి రాజీనామా చేసిన ఆయన.. గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి సమక్షంలో వైఎస్సార్ సీపీ కండువా కప్పుకున్నారు. ఎమ్మెల్యే కనకరావును పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కనకారావుతో పాటూ మరికొందరు జనసేన పార్టీ కార్యకర్తలు వైసీపీలో చేరారు. జేడీ లక్ష్మీనారాయణ ఇచ్చిన షాక్ నుంచి తేరుకోక ముందే.. పవన్ కళ్యాణ్ కి మరో కరణం మరో షాక్ ఇచ్చారు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ... కనకారావు పవన్ పోటీ చేసిన గాజువాక నియోజకవర్గానికి చెందిన నేత కావడం గమనార్హం.