Begin typing your search above and press return to search.
కరణమే మంత్రిట... ఆయనకు షాక్ ట ?
By: Tupaki Desk | 21 March 2022 2:30 AM GMTనిజానికి కరణం అంటేనే ఒక హోదా. కానీ ఈ కరణానికి అది ఇంటి పేరు మాత్రమే. ఆయనే వైసీపీ సీనియర్ ఎమ్మెల్యే, విశాఖ జిల్లా చోడవరానికి చెందిన కరణం ధర్మశ్రీ. వైఎస్సార్ హయాం నుంచి ఆ కుటుంబానికి వీర విధేయుడిగా ఉన్న కరణం ధర్మశ్రీకి గుడ్ న్యూస్ వచ్చేసింది అంటున్నారు. ఆయన్ని అంతా కలసి అపుడే శుభాకాంక్షలు చెప్పడం మొదలెట్టారు. కాబోయే మంత్రి గారికి స్వాగతం అని కూడా అనుచరులు అంటున్నారు. దాంతో విశాఖ జిల్లాలో కరణం వర్గం జోష్ మామూలుగా లేదు.
విశాఖ రూరల్ జిల్లా అనకాపల్లిగా మారబోతోంది. దాంతో ఈ జిల్లా నుంచి ఒకరిని కచ్చితంగా మంత్రి పదవి దక్కుతుంది అంటున్నారు. కాపులకే ఆ పదవి ఖాయమని అంటున్నారు. విశాఖ జిల్లాలో ఏకైక కాపు మంత్రి అవంతి శ్రీనివాస్ ని తప్పిస్తే అక్కడ యాదవ సామాజికవర్గానికి చెందిన వంశీ క్రిష్ణ శ్రీనివాస్ కి మంత్రి పదవి దక్కుతుంది అంటున్నారు.
దాంతో సామాజిక సమీకరణలలో భాగంగా అనకాపల్లి జిల్లాకు కాపు కోటాలో మంత్రి ఉంటారని తెలుస్తోంది. ఇక ఆ సామాజికవర్గం నుంచి గుడివాడ అమరనాధ్, కరణం ధర్మశ్రీ ఇద్దరూ పోటీ పడుతున్నా కూడా కరణం సీనియర్ కావడం కలసి వచ్చే అంశంగా ఉంది అంటున్నారు. ఇక జిల్లాలోని ఎక్కువ మంది ఎమ్మెల్యేలు కూడా కరణానికి ఇస్తే బాగుంటుంది అని మద్దతు ఇస్తున్నారు అని తెలుస్తోంది.
దాంతో కరణం ధర్మశ్రీకి అవకాశాలు మెరుగు అయ్యాయని అంటున్నారు. ఇక ఈసారి ఎన్నికల మంత్రివర్గాన్ని కూర్పు చేస్తున్నారు కాబట్టి సీనియర్లకు పెద్ద పీట వేయాలని కూడా నిర్ణయించినట్లుగా చెబుతున్నారు. అదే విధంగా వీరవిధేయులకు పట్టం కట్టాలన్నది కూడా ప్రమాణంగా పెట్టుకున్నారు. ఇక ధర్మశ్రీ మాటకారి కూడా కావడం మరో ప్లస్ పాయింట్ అవుతోంది.
ఈ మొత్తం సమీకరణలు అన్నీ కూడా కరణానికి రాచబాటగా మారాయని అంటున్నారు. మరో వైపు చూస్తే గుడివాడ ఇంకా యువకుడే కాబట్టి ఆయనకు జిల్లా వైసీపీ అధ్యక్ష బాధ్యతలు ఈసరికే అప్పగించారు కాబట్టి వచ్చే ఎన్నికల తరువాత పార్టీ గెలిస్తే చాన్స్ ఇస్తారని అంటున్నారు. మరి ఈ పరిణామాలతో గుడివాడ వర్గంలో కొంత అలజడి రేగుతోంటే కరణం ధర్మశ్రీ వైపు చూస్తే అపుడే హుషార్ కనిపిస్తోంది. మరి అఫీషియల్ గా లిస్ట్ వచ్చేంతవరకూ ఎవరు ఏమిటి అన్నది తెలియదు అనే చెప్పాలి.