Begin typing your search above and press return to search.
హోం మినిస్టర్ దగ్గరికి సినిమా పంచాయితీ!
By: Tupaki Desk | 20 Oct 2016 9:46 AM GMTపాకిస్థానీ హీరో నటించిన కారణంగా నిషేధాన్ని ఎదుర్కొంటున్న "ఏ దిల్ హై ముష్కిల్" పంచాయితీ మంత్రిగారి దగ్గరకు చేరింది. ఈ సినిమా విడుదలకు చిక్కులు ఎదురు కావడంతో ఈ విషయాన్ని కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ దృష్టికి తీసుకువెళ్లేందుకు ఆ సినిమా యూనిట్ యత్నిస్తోంది. ఇందులో భాగంగా కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ తో బాలీవుడ్ నిర్మాత - దర్శకుడు కరణ్ జోహార్ తోపాటు ధర్మా ప్రొడక్షన్స్ అపూర్వ మెహతా - ఫాక్స్ స్టార్స్ విజయ్ సింగ్ తదితరులు భేటీ కానున్నట్లు నిర్మాత ముఖేష్ భట్ తెలిపిన సంగతి తెలిసిందే. అయితే ఈ భేటీకి ఆ సినిమా దర్శకుడు కరణ్ జోహార్ మొహం చాటేసినట్లు కనిపిస్తోంది.
అయితే ఉరీ ఉగ్రదాడి అనంతరం "ఏ దిల్ హై ముష్కిల్" సినిమా విడుదల వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. ఉరీ ఉగ్రదాడి అనంతరం పాకిస్తాన్ కళాకారులు భారత దేశాని వదలి వెళ్లిపోవాలని, వారిని బాలీవుడ్ సినిమాల్లో నటింపచేయరాదని, వారు ఇప్పటికే నటించిన సినిమాల విడుదలను ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకుంటామని మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ ఎస్) హెచ్చరించింది. ఇదే సమయంలో బీజేపీ యువమోర్చా (బీజేవైఎం) కూడా ఈ సినిమాను వ్యతిరేకిస్తూ నిరసనలు చేపడుతోంది.
దీపావళి పండుగను పురస్కరించుకుని ఈ నెల 28న ఈ సినిమాను విడుదల చేయడానికి దర్శక నిర్మాతలు ప్లాన్ చేసుకున్నారు. అయితే తాజాగా ఏర్పడిన పరిస్థితుల మధ్య ఈ ఈ సినిమా విడుదలవుతుందా లేదా అనే విషయంపై తీవ్ర ఉత్కంఠ ఏర్పడింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ సినిమాను విడుదల చేసేందుకు పోలీసు బందోబస్తు ఇస్తుందా లేదా అనే విషయంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కేంద్ర హోం మంత్రితో ఆ చిత్ర యూనిట్ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.
కాగా, ఉడీ ఉగ్రదాడిలో 18 మంది భారత సైనికులు అమరులైన విషయం తెలిసిందే. ఈ ఘటనతో దేశవ్యాప్తంగా పాకిస్తాన్ కు వ్యతిరేకంగా తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో పాకిస్తాన్ కళాకారులు నటించిన సినిమాలను విడుదల కానివ్వమంటూ ఎంఎన్ ఎస్ ప్రకటించింది. అలాగే పలు రాష్ట్రాల్లోని థియేటర్ల యజమానులు ఈ సినిమాను ప్రదర్శించేది లేదని ఇప్పటికే తేల్చి చెప్పగా, ముంబైలోని సింగిల్ స్క్రిన్ థియేటర్ల యూనియన్ కూడా పాకిస్తాన్ కళాకారులు నటించిన సినిమాలను తమ థియేటర్లలో ఆడించమని నిర్ణయం తీసుకుంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/