Begin typing your search above and press return to search.
కరణ్ అదానీ చెప్పింది పచ్చి అబద్ధం?
By: Tupaki Desk | 4 March 2023 4:00 PM GMTవిశాఖలో జరుగుతున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో పాల్గొన్న ఆదానీ గ్రూప్ సీఈవో కరణ్ అదానీ ఏపీలో ఏపీలో తాము ఇచ్చే ఉద్యోగాల లెక్కలు తప్పు చెప్పారా. ఆయన చెప్పిన దాంటో వాస్తవం లేదా అన్న చర్చ అయితే సాగుతోంది. ఎందుకంటే కరణ్ అదానీ చెప్పింది ఏపీలో వివిధ రంగాల్లో ఇప్పటికే ఇరవై వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టినట్లుగా సమ్మిట్ లో మాట్లాడుతూ కరణ్ అదానీ తెలిపారు
తమ పెట్టుబడుల వల్ల ప్రత్యక్షంగా పరోక్షంగా డెబ్బై వేల మంది దాకా యువత ఉపాధి పొందుతారు అని ఆయన పేర్కోనడం జరిగింది. అలాగే గన్నవరం, క్రిష్ణపట్నం పోర్టుల సామర్ధ్యాన్ని 200 మీటర్లకు పెంచనున్నట్లుగా కిరణ్ అదానీ చెప్పారు. అలాగే రెన్యువబుల్ ఎనర్జీలో 15 వేల మెగావాట్లతో విద్యుత్ ఉత్పత్తికి ఒప్పందం చేసుకున్నామని ఆయన చెప్పారు.
ఇవన్నీ పక్కన పెడితే ఏపీలో ఇదే విధంగా మొత్తం డెబ్బై వేల మందికి ఉద్యోగాలు అన్న దాని మీద అదానీ గ్రూప్ ఎక్కడ నుంచి ఇస్తోంది అన్న దాని మీదనే భిన్నాభిప్రాయాలు ఉన్నాయని అంటున్నారు. అదెలా అంటే అదానీ గ్రూప్ 1988లో అహ్మదాబాద్ లో ఏర్పాటు అయింది. గౌతం అదానీ దాని అధినేత ఇక ఈ గ్రూప్ కి ప్రధానంగా కమోడిటీ ట్రేడింగ్ బిజినెస్ గా ఉంది.
అయితే తరువాత అనేక రంగాలలో బిజినెస్ చేస్తోంది. ఇక ఈ గ్రూప్ కి సంబంధించి గూగుల్ లో అందుబాటులో ఉన్న సమాచారం చూస్తే లేటెస్ట్ వివరాలు తీసుకుంటే అంటే 2023 నాటికి మొత్తం గ్రూప్ లోని అన్ని కంపెనీల నుంచి 23 వేల మంది మాత్రమే ఉపాధి అవకాశాలు పొందుతున్నట్లుగా ఉంది. ఇది అదానీ గ్రూప్ అని వికీ పీడియాలో చూపిస్తున్న లేటెస్ట్ ఇంఫర్మేషన్.
మరి ఏపీలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ కి వచ్చిన కరణ్ అదానీ ఒక్క ఏపీలోనే ఏకంగా డెబ్బై వేల మందికి ఉపాధి అని చెబుతున్నారు. తమ ప్రాజెక్టుల ద్వారా ఏపీలో ఇంత పెద్ద ఎత్తున ఉద్యోగాలు వస్తున్నాయని వివరిస్తున్నారు.
దీన్ని బట్టి చూస్తే మొత్తం కంపెనీల నుంచే 23 వేల మంది దేశవ్యాప్తంగా అదానీ సంస్థల ద్వారా ఉపాధి పొందుతూంటే కేవలం ఏపీలోనే డెబ్బై వేల మందికి జాబ్స్ ఎలా సాధ్యం బాబూ అంటున్నారు.
మరి ఈ లెక్కలేంటో ఈ తిరకాసు ఏంటో అదానీ సంస్థ నిర్వహాకులే చెప్పాల్సి ఉంటుంది. ఈ విషయంలో కిరణ్ అదానీ చెప్పినది పచ్చి అబద్ధం అని అనుకుంటున్నారు దీని మీద నెటిజన్లు కూడా అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారా అని అడుతున్నారు. అది కూడా వికీ పీడియాలో అదానీ గ్రూపు వివరాలను దగ్గర పెట్టుకుని మరీ వారు ఈ ప్రశ్నలు వేస్తున్నారు నిజంగా కరణ్ అదానీ ఈ మాటలు చెప్పారా. లేక చెప్పాలని ఫ్లోలో చెప్పేశారా అన్నది చూడాల్సి ఉంది అంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.