Begin typing your search above and press return to search.

సొంత ఎమ్మెల్యేనే పార్టీ నేత‌లు కుమ్మేశారు

By:  Tupaki Desk   |   31 May 2017 12:17 PM GMT
సొంత ఎమ్మెల్యేనే పార్టీ నేత‌లు కుమ్మేశారు
X
ఆమ్ ఆద్మీ పార్టీలో నెల‌కొన్న విబేధాలు తారాస్థాయికి చేరాయి. ఏకంగా ముఖ్య‌నేత‌ను లాక్కెళ్లి కొట్టే స్థాయికి చేరింది. ఢిల్లీ అసెంబ్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే క‌పిల్ మిశ్రాను దారుణంగా లాక్కెళ్లారు. ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేజ్రీవాల్‌ పై అవినీతి ఆరోప‌ణ‌లు చేసిన మిశ్రాను ఇటీవ‌ల పార్టీ నుంచి స‌స్పెండ్ చేశారు. అయితే అసెంబ్లీ స‌మావేశాల సంద‌ర్భంగా మిశ్రా స‌భ‌కు వ‌చ్చారు. త‌న‌కు మాట్లాడే అవ‌కాశం ఇవ్వాల‌ని స‌భాప‌తిని కోరారు. సీఎం కేజ్రీవాల్ అవినీతి ఆరోప‌ణ‌ల‌పై విచార‌ణ చేప‌ట్టాల‌ని డిమాండ్ చేశారు. దీంతో ఆప్ ఎమ్మెల్యేల‌కు, క‌పిల్ మిశ్రాల‌కు స‌భ‌లో వాగ్వాదం జ‌రిగింది.

ఈ సంద‌ర్భంగా మిశ్రాపై కొంద‌రు ఎమ్మెల్యేలు చేయిచేసుకున్న‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. మిశ్రాను స‌స్పెండ్ చేస్తూ స్పీక‌ర్ నిర్ణ‌యించారు. డిప్యూటీ సీఎం సిసోడియా ఆదేశాల మేర‌కే త‌న‌ను స‌స్పెండ్ చేసిన‌ట్లు మిశ్రా తెలిపారు. అసెంబ్లీ హాల్ నుంచి ఎమ్మెల్యే మిశ్రాను మార్ష‌ల్స్ లాక్కెళ్లారు. కేజ్రీవాల్‌పై అవినీతి ఆరోప‌ణ‌లు చేసిన మిశ్రాను ఇటీవ‌లే మంత్రి ప‌ద‌వి నుంచి కూడా తొలగించిన సంగ‌తి తెలిసిందే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/