Begin typing your search above and press return to search.

టీమిండియా సెమీస్ చేరడం కష్టమే.. కపిల్ దేవ్ షాకింగ్ కామెంట్స్

By:  Tupaki Desk   |   20 Oct 2022 1:30 PM GMT
టీమిండియా సెమీస్ చేరడం కష్టమే.. కపిల్ దేవ్ షాకింగ్ కామెంట్స్
X
గత ఏడాది యూఏఈ వేదికగా జరిగిన టీ20 వరల్డ్ కప్ భారత్ కు చేదు అనుభవాన్ని మిగిల్చింది.బలమైన టీమిండియా పాకిస్తాన్ చేతిలో ఓడి ఇంటిదారి పట్టింది. ప్రపంచకప్ వేదికలపై ఓటమి ఎరుగని టీమిండియాను పాకిస్తాన్ ఓడించింది. ఈదెబ్బకు విరాట్ కోహ్లీ కెప్టెన్సీ కూడా పోయింది. రోహిత్ శర్మ కెప్టెన్ అయ్యాడు. టీంలో భారీ మార్పులు వచ్చాయి. కొత్త కోచ్ రాహుల్ ద్రావిడ్ కూడా వచ్చిచేరాడు. ఇప్పుడు ఆస్ట్రేలియాలో మరో ప్రపంచకప్ కు రంగం సిద్ధమైంది.

టీ20 ప్రపంచ కప్ 2022లో టీమ్ ఇండియా తన మొదటి మ్యాచ్ లోనే చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై ప్రతీకారంకోసం రెడీ అవుతోంది. ఆస్ట్రేలియాలోని ఐకానిక్ మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ)లో ఈ మ్యాచ్ జరగనుంది. భారత మాజీ ఆటగాళ్ళు, దిగ్గజాలు సచిన్ టెండూల్కర్ , రవిశాస్త్రి లు టీమిండియా ఈజీగా సెమీ-ఫైనల్‌కు చేరుకుంటుందని తమ విశ్లేషణలు చేస్తున్నారు.

భారత్ జట్టులో ఆ సత్తా ఉందని భావిస్తున్నారు. అయితే భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ మాత్రం అలా భావించడం లేదు. ఆయన అంచనా ప్రకారం, సెమీ ఫైనల్‌కు భారత్‌కు అర్హత సాధించే అవకాశాలు తక్కువ అని అభిప్రాయపడుతున్నాడు. టాప్ 4లో చోటు దక్కించుకుంటేనే భారత్ టైటిల్ అవకాశాలు ఉంటాయని ఆయన సంచలన కామెంట్స్ చేశారు.

"టీ20 క్రికెట్‌లో ఒక మ్యాచ్‌లో గెలిచిన జట్టు తదుపరి మ్యాచ్‌లో ఓడిపోవచ్చు.. భారత్‌ ప్రపంచకప్‌ను గెలుచుకునే అవకాశాల గురించి మాట్లాడటం చాలా కష్టం. సమస్య ఏమిటంటే.. వారు మొదటి నాలుగు స్థానాల్లో సెమీస్ లో చేరగలరా? అన్న దానిపైనే నేను ఆందోళన చెందుతున్నాను. వారు సెమీస్ కు చేరితేనే కప్ గురించి చెప్పగలం. నాకు టీమిండియా మొదటి నాలుగు స్థానాల్లోకి వచ్చే అవకాశం కేవలం 30% మాత్రమే కనిపిస్తోంది" అని లక్నోలో జరిగిన ప్రచార కార్యక్రమంలో కపిల్ దేవ్ ఈ హాట్ కామెంట్స్ చేశాడు.

అయితే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ , కేఎల్ రాహుల్ వంటి స్టార్‌లను కలిగి ఉన్న భారత్‌కు మంచి బ్యాటింగ్ అటాక్ ఉందని కపిల్ పేర్కొన్నాడు. విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్‌తో కూడిన జట్టులో సూర్యకుమార్‌ లాంటి బ్యాటర్‌ ఉండటం వల్ల జట్టు ఆటోమేటిక్‌గా పటిష్టం అవుతుంది’’ అని కపిల్ దేవ్ అభిప్రాయపడ్డాడు.

బుధవారం (అక్టోబర్ 19)న న్యూజిలాండ్‌తో జరిగిన రెండో వార్మప్ వర్షం కారణంగా రద్దు అయ్యింది. బ్రిస్బేన్‌లో ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో మ్యాచ్ రద్దు చేశారు. ఈ ప్రపంచ కప్‌లో చాలా మ్యాచ్‌లు ప్రతికూల వాతావరణంతో ప్రభావితమయ్యే అవకాశాలు ఉన్నాయి, ఇందులో భారీగా ఎదురుచూస్తున్న భారత్ vs పాకిస్థాన్ పోటీ కూడా ఉంది. టోర్నమెంట్ శనివారం (అక్టోబర్ 22) సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ (SCG)లో ఆతిథ్య ,డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాతో గత ఏడాది ఫైనలిస్ట్ న్యూజిలాండ్‌ తలపడుతుంది. ఈ మ్యాచ్ తోనే టీ20 ప్రపంచకప్ ప్రారంభం కాబోతోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.