Begin typing your search above and press return to search.

అభిమానుల దివెనలతో కోలుకుంటున్నా.. కపిల్ ఉద్వేగభరిత పోస్ట్

By:  Tupaki Desk   |   24 Oct 2020 6:45 AM GMT
అభిమానుల దివెనలతో కోలుకుంటున్నా.. కపిల్ ఉద్వేగభరిత పోస్ట్
X
భారత క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ (61) ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉంది. గురువారం అర్ధరాత్రి కపిల్​దేవ్​ గుండెపోటు రావడంతో ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. దీంతో క్రికెట్​ అభిమానులు తీవ్ర ఆందోళన చెందారు. కపిల్ త్వరగా కోలుకోవాలంటూ ఫ్యాన్స్​ పూజలు చేశారు. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి కపిల్​దేవ్​ ఇన్​స్టా వేదికగా స్పందించారు. ‘అభిమానుల ఆశీర్వాదం, దేవుడి దయతో నేను క్షేమంగా ఉన్నాను. నా ఆరోగ్యం కోసం భగవంతుడిని ప్రార్థించిన నా అభిమానులు, శ్రేయోభిలాషులకు రుణపడి ఉంటాను. మీ అభిమానంతో మీరిచ్చిన దీవెనలతో నేను త్వరగా కోలుకుంటున్నాను’bఅంటూ కపిల్​ పేర్కొన్నారు. గురువారం అర్ధరాత్రి కపిల్​కు గుండెపోటు రావడంతో కుటుంబసభ్యులు ఢిల్లీ లోని ఓఖ్లా లోని ఫోర్టిస్ ఆసుపత్రి లో చేర్పించారు. అతడికి యాంజియోప్లాస్టీ చికిత్స చేశామని... ప్రస్తుతం ఆరోగ్యం నిలకడ గానే ఉందని వైద్యులు తెలిపారు.

అయితే ఇప్పటికీ కపిల్​ ఐసీయూలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. మరో రెండ్రోజుల్లో డిశార్జి అయ్యే అవకాశం ఉన్నదని వైద్యులు తెలిపారు. భారత్​కు తొలి ప్రపంచకప్​ (1983) తీసుకురావడంలో కపిల్​దేవ్​ కీలకపాత్ర పోషించారు. భారత్‌ తరఫున 131 టెస్టులు, 225 వన్డేలు ఆడాడు. టెస్టుల్లో 5248 పరుగులతో పాటు 434 వికెట్లు తీశాడు. వన్డేల్లో 3783 పరుగులు, 253 వికెట్లు సాధించాడు.

టేక్​కేర్​ పాజీ..

కపిల్ త్వరగా కోలుకోవాలని టీమిండియా క్రికెటర్లు, మాజీలు, అభిమానులు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌లు చేశారు. సచిన్​ టెండూల్కర్​, భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, శిఖర్‌ ధావన్‌, మాజీ ఆల్‌రౌండర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌, సురేశ్​ రైనా, మాజీ క్రికెటర్‌ మదన్‌లాల్‌ ట్వీట్‌లు చేశారు. గెట్‌వెల్‌ సూన్‌ పాజీ!'అంటూ సచిన్‌ ట్వీట్ చేశారు. 'మీరు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. గెట్‌ వెల్‌ సూన్‌ పాజీ.'అని విరాట్‌ కోహ్లీ ఆకాక్షించాడు.