Begin typing your search above and press return to search.

కోహ్లీని అందుకే తొలగించారట.. చెప్పాల్సిన అవసరం లేదన్న కపిల్ దేవ్

By:  Tupaki Desk   |   16 Dec 2021 5:30 PM GMT
కోహ్లీని అందుకే తొలగించారట.. చెప్పాల్సిన అవసరం లేదన్న కపిల్ దేవ్
X
వన్డే కెప్టెన్సీ నుంచి అర్థాంతరంగా తొలగించడంతో విరాట్ కోహ్లీ బరస్ట్ అయ్యాడు. తాజాగా పర్యటనకు ముందు విలేకరులతో మాట్లాడుతూ బీసీసీఐ తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే గంటన్నరలో కెప్టెన్సీ నుంచి తొలగించిందని విరాట్ కోహ్లీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే అందుకు గల కారణాలను కోహ్లీ తాజాగా పేర్కొన్నాడు. ‘నా కెప్టెన్సీలో భారత జట్టు ఒక్క అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) టోర్నమెంట్ కూడా నెగ్గలేదనేది వాస్తవం.. నన్ను తొలగించడానికి అదో కారణం కావచ్చు. అది సరైందా? కాదా? అనే దానిపై చర్చ అనవసరం.. ఆ నిర్ణయాన్ని నేను అర్థం చేసుకోగలను. దానికి సంబంధించి జరిగిన పరిణామాల గురించి నేను మాట్లాడుతున్నా.. భారత కెప్టెన్సీ ఒక గౌరవం.. ఇప్పటివరకూ వన్డేలకు సంబంధించి పూర్తి నిజాయితీతో, అత్తుత్తమ సామర్థ్యంతో ఆ బాధ్యతను నిర్వర్తించానని కోహ్లీ పేర్కొన్నాడు.

ఇక కొత్త కెప్టెన్ రోహిత్ తో తనకు సమస్య లేదని విరాట్ అన్నాడు. రోహిత్ సమర్థుడైన నాయకుడన్నాడు. మంచి వ్యూహ చతురుడు. ఐపీఎల్ తోపాటు భారత్ కు సారథిగా వ్యవహరించిన కొన్ని మ్యాచ్ లలో కూడా అది చూశాం.. కోచ్ గా రాహుల్ ద్రావిడ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వారిద్దరికి పూర్తి సహాయ సహాకారాలు అందిస్తానని తెలిపాడు. భారత జట్టును దెబ్బతీసే ఎలాంటి పనులూ చేయనని తెలిపాడు. నాకు, రోహిత్ శర్మకు మధ్య ఎప్పుడూ , ఎలాంటి విభేదాలు లేవన్నారు.

కెప్టెన్సీ వివాదం ముదురుతున్న నేపథ్యంలో లెజండరీ క్రికెటర్ కపిల్ దేవ్ ఈ విషయంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. జట్టు కెప్టెన్సీని నిర్ణయించే హక్కు సెలెక్టర్లకు ఉంటుంది అని అతడు అభిప్రాయపడ్డాడు.

సెలెక్టర్లు విరాట్ కోహ్లీ ఆడినంతగా క్రికెట్ ఆడకపోవచ్చు. కానీ సారథ్య బాధ్యతల గురించి నిర్ణయించే హక్కు వారికే ఉంటుంది. వారు తమ నిర్ణయం గురించి ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదు. ఇది కేవలం విరాట్ కోహ్లీకే కాదు.. ప్రతి ఒక్క ఆటగాడికి వర్తిస్తుంది. ఈ వివాదం కోహ్లీ టెస్ట్ కెప్టెన్సీపై ప్రభావం చూపదని నేను ఆశిస్తున్నాను. విరాట్ ఇప్పుడు కెప్టెన్సీ వివాదాన్ని విడిచిపెట్టి దక్షిణాఫ్రికా పర్యటనపై దృష్టి పెడుతాడని భావిస్తున్నానని పేర్కొన్నారు.