Begin typing your search above and press return to search.

మునుగోడులో గెలిచేస్తాడట.. కేఏ పాల్ నా మజాకా?

By:  Tupaki Desk   |   11 Sep 2022 2:30 AM GMT
మునుగోడులో గెలిచేస్తాడట.. కేఏ పాల్ నా మజాకా?
X
మునుగోడు ఉప ఎన్నిక తెలంగాణలో రచ్చ లేపుతోంది. అధికార టీఆర్ఎస్, బీజేపీ హోరాహోరీగా భావిస్తుండగా.. కాంగ్రెస్ కూడా తమ సీటును తాము దక్కించుకోవాలని సర్వశక్తులూ ఒడ్డుతోంది, ఈ మూడు పార్టీలతోనే మునుగోడు ఉక్కిరిబిక్కిరి అవుతుండగా.. మధ్యలోకి వచ్చాడు ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు, ప్రముఖసువార్త వేత్త ‘కేఏ పాల్’.

గడిచిన ఏపీ రాజకీయాల్లో పిడుగులా ఎంట్రీ అయ్యి రాజకీయ కామెడీ పంచిన కేఏపాల్ తాజాగా సంబంధం లేని మునుగోడు ఎన్నికల్లో తలదూర్చాడు. ప్రపంచ శాంతి దూత ఎంట్రీతో మునుగోడు ఎన్నికలు మలుపుతిరిగాయి.

మునుగోడులో కేసీఆర్ ను చిత్తును ఓడగొడుతానని ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ అన్నారు. మునుగోడులో ప్రజాశాంతి పార్టీ గెలిచిన ఆరునెలల్లోనే 50వేల ఉద్యోగాలు ఇవ్వడంతోపాటు ఉచిత విద్య, మునుగోడులోని ప్రతి గ్రామంలో తన చారిటీ ద్వారా ఉద్యోగాలు ఇష్తానని.. ప్రజలందరూ ముందుకు వచ్చి ప్రజాశాంతిని గెలిపించాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ అవినీతి పాలనకు ఇంకా కాలం చెల్లిందన్నారు.

వచ్చే నెలల్లో హైదరాబాద్ లో నిర్వహించే గ్లోబల్ పీస్ మీటింగ్ కు 28 దేశాల అధ్యక్షులు , ప్రధానులు వస్తున్నారని..ఈ మీటింగ్ కు ఆహ్వానిద్దామంటే అహంతో తనను కేసీఆర్ కలవడం లేదని.. సహకరించడం లేదని కేఏపాల్ ఆరోపించారు. తెలంగాణ రాకముందు కేసీఆర్ ఆస్తి ఎంత.. ఇప్పుడు ఎంత అంటూ పాల్ ప్రశ్నించారు.

గతంలో బీజేపీకి సపోర్ట్ చేసిన కేసీార్ ఇప్పుడు కేంద్రంపై యుద్ధం అంటూ నాటకాలు ఆడుతున్నారని పాల్ ఆరోపించారు.

మొత్తంగా ఏపీలో ఒక్క సీటు గెలవకున్నా కేఏపాల్ చేసిన హంగామా అంతా ఇంతాకాదు.. ఇక తెలంగాణలో అసలు బలమే లేకున్నా మునుగోడులో గెలుస్తానంటున్నాడు. కేఏపాల్ సీరియస్ కామెడీకి జనాలు ఓట్లు రాలుతాయో లేదో చూడాలి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.