Begin typing your search above and press return to search.

ఇదేం పోలిక:బాబు రాముడు..లోకేష్ ల‌క్ష్మ‌ణుడు

By:  Tupaki Desk   |   5 May 2018 4:21 AM GMT
ఇదేం పోలిక:బాబు రాముడు..లోకేష్ ల‌క్ష్మ‌ణుడు
X

రామాయ‌ణం మీకంద‌రికీ తెలిసిందే ఉంటుంది. అందులో రాముడు అగ్ర‌జుడు - ఆయ‌న సోదరుడు ల‌క్ష్మ‌ణుడు. వీరిద్ద‌రిది అన్న‌ద‌మ్ముల బంధం. `ఈ విష‌యం గురించి మాకు తెలియ‌దా? మీరు ఎందుకు చెప్తున్నారు? చిన్న పిల్లాడిని అడిగినా ఇదే చెప్తారు క‌దా?` అంటూ విసుక్కోకండి. ఈ ఆత్మీయ అన్న‌ద‌మ్ముల‌ సంబంధాన్ని తండ్రీకొడుకులకు వ‌ర్తింప‌చేశారు ఓ టీడీపీ నేత‌! పార్టీలో చేరుతున్న సంతోషంలో ఆయ‌న ఈ కొత్త పోలికను ప్ర‌వించారు. దీంతో అవాక్క‌వ‌డం అక్క‌డున్న టీడీపీ నేత‌ల వంతు అయింది. ఇంత‌కీ ఆ నాయ‌కుడు ఎవ‌రంటే...భారతీయ జనతా పార్టీ మాజీ నేత రఘురామకృష్ణం రాజు. అమరావతిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో తన కుమారుడితో కలిసి టీడీపీలో చేరిన రఘురామకృష్ణం రాజు అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ అవాక్క‌య్యే వ్యాఖ్య‌లు చేశారు

ప‌శ్చిమ గోదావరి జిల్లాకు చెందిన రఘురామ కృష్ణరాజు కొన్నాళ్లు వైసీపీలో కొనసాగారు. ఆ తర్వాత ఆయన బీజేపీలో చేరారు. కాంగ్రెస్‌ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావుకు వియ్యంకుడైన రఘురామ కృష్ణ రాజు ఇప్పుడు బీజేపీకి గుడ్‌ బై చెప్పి టీడీపీలో చేరారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ మంత్రులు అయ్యన్నపాత్రుడు - పుల్లారావు - పశ్చిమ గోదావరి జిల్లా పార్టీ నేతలతో ఓ కుటుంబసభ్యుడిగా టచ్‌ లో ఉన్నానని చంద్రబాబుకు మరింత గౌరవం తీసుకువచ్చేలా అందరితో కలిసి కృషి చేస్తానని చెప్పారు. పశ్చిమగోదావరి జిల్లాలోని మొత్తం 15 సీట్లు గెలిపించి చంద్రబాబుకు కానుకగా ఇస్తామని రఘురామ కృష్ణం రాజు ప్రకటించారు. ఈ సంద‌ర్భంగానే తండ్రీ కొడుకుల‌ను ఆకాశానికి ఎత్తేశారు.

సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు పనిచేస్తామన్న రఘురామ కృష్ణం రాజు చంద్రబాబులో ఓ సారి శాంతమూర్తి గాంధీ మహాత్ముడు కనిపిస్తే… మరోసారి అల్లూరి సీతారామరాజును చూస్తామని విశ్లేషించారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రాముడైతే మంత్రి నారా లోకేష్ లక్ష్మణుడంటూ రఘురామ కృష్ణం రాజు అభివర్ణించారు అభివర్ణించారు.ఇక మంత్రి నారా లోకేష్‌ గురించి ఆయన మాట్లాడుతూ చంద్రబాబులోని కార్యదక్షత - స్వర్గీయ ఎన్టీఆర్‌ లోని కలుపుగోలుతనం కలిసి ఉన్న వ్యక్తి లోకేష్‌ అంటూ ప్రశంసించారు. పరిస్థితులకు అనుగుణంగా చంద్రబాబు నడుచుకుంటారని ఆయన ఆదేశాల మేరకు ఫలితాలు వచ్చేలా పని చేస్తామని హామీ ఇచ్చారు.