Begin typing your search above and press return to search.

కామెడీగా మారిన సీఎం సతీమణి ప్రసంగం

By:  Tupaki Desk   |   12 May 2016 10:26 AM IST
కామెడీగా మారిన సీఎం సతీమణి ప్రసంగం
X
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ సతీమణి డింపుల్ యాదవ్ ఎంపీ అన్న విషయం తెలిసిందే. కన్నౌజ్ నియోజకవర్గం నుంచి పార్లమెంటు సభ్యురాలిగా వ్యవహరిస్తున్న ఆమె ఇప్పుడు వార్తల్లోకి వచ్చారు. లోక్ సభలో ఆమె చేసిన ప్రసంగం ఇప్పుడు కామెడీ.. కామెడీగా మారి సోషల్ మీడియాలో హడావుడి చేస్తోంది. హిందీ మాట్లాడేందుకు కిందామీదా పడిన ఆమె ప్రసంగాన్ని కామెడీగా ఎడిట్ చేశారు.

ఉత్తరప్రదేశ్ లోని సమస్యలు.. మేకిన్ ఇండియా మీద ఆమె మాట్లాడుతున్న సందర్భంగా హిందీలోని పలు పదాల్ని పలికేందుకు ఆమె తడబాటుకు గురి కావటమే కాదు.. పలు సందర్భాల్లో తప్పుగా ఉచ్చరించటం గమనార్హం. రాసుకొచ్చిన ప్రతిలోని అంశాల్ని చూస్తూ ప్రసంగించిన ఆమె మాటల్ని వింటూ పలువురు ఎంపీలు నవ్వుకోవటం కనిపించింది.

దీంతో.. ఆమె ఫీల్ అయినట్లుగా చెబుతున్నారు. తాను చేసిన స్పీచ్ కు ఎంపీలు నవ్వారంటూ ఫీలయ్యే బదులు.. చక్కగా ప్రిపేర్ అయి వచ్చి ఉంటే ఈ తిప్పలు ఉండేవి కాదు కదా. అయినా.. హిందీలో మాట్లాడేందుకు డింపుల్ కు అంత తడబాటు ఏంటి చెప్మా..?