Begin typing your search above and press return to search.

మోడీకి మరో షాక్..ఐఏఎస్ అల్టీమేటం..

By:  Tupaki Desk   |   30 Jan 2020 10:16 AM GMT
మోడీకి మరో షాక్..ఐఏఎస్ అల్టీమేటం..
X
జమ్మూకాశ్మీర్ ను విభజించి వారికి రాజ్యాంగం కల్పించిన ఆర్టికల్ 370 ని రద్దు చేసిన మోడీ సర్కారు షాకుల మీద షాకులు తగులుతూనే ఉన్నాయి. అక్కడి రాజకీయ నాయకులు, ప్రజలే కాదు.. తాజాగా మోడీ కశ్మీర్ విషయంలో వ్యవహరించిన తీరుతో మనస్థాపం చెందిన యువ ఐఏఎస్ అధికారి కన్నాన్ గోపినాథన్ తన పదవికి రాజీనామా చేసి సంచలనం సృష్టించారు. రాజీనామాపై కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడంతో తనను విధుల నుంచి డిస్మిస్ చేయాలని కేంద్రాన్ని ఆయన కోరడం అధికార వర్గాల్లో కలకలం రేపుతోంది.

ప్రధాని మోడీ కశ్మీర్ ను విభజించి ఆర్టికల్ 370 రద్దు చేసి కశ్మీర్ లో ఆంక్షలు పెట్టినప్పుడే యువ ఐఏఎస్ అధికారి కన్నాన్ గోపినాథన్ ఐఏఎస్ పదవికి రాజీనామాా చేశారు. 6 నెలల నుంచి రాజీనామాపై కేంద్రం నాన్చుతోంది. ఆమోదిస్తే తమ ప్రభుత్వానికి చెడ్డాపేరు వస్తుందని జాప్యం చేస్తోంది.

అయితే దీనిపై తాజాగా కన్నన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన రాజీనామా ఆమోదించకుంటే సర్వీస్ నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. కశ్మీర్ విభజనకు వ్యతిరేకంగానే రాజీనామా చేసినట్టు స్పష్టం చేశారు. రాజీనామా ఆమోదిస్తే కశ్మీర్ ప్రజలతో కలిసి పోరాడుతానని స్పష్టం చేశారు.

మోడీ తీసుకొచ్చిన సీఏఏ, ఎన్నార్పీ, ఎన్నార్సీలతో ప్రజలకు ప్రమాదమని కన్నన్ ఆరోపించారు. హిందువులకే మేలు చేస్తూ మైనార్టీలను బీజేపీ అణగదొక్కుతోందని.. వివక్ష చూపుతోందని కన్నన్ ఆరోపించారు. మతపరంగా విద్వేషం రెచ్చగొడుతోందని ఆరోపించారు. దేశంలో నిరుద్యోగం, ద్రవ్యోల్బణం పెరిగి వృద్ధి రేటు తగ్గుతున్నా కేంద్రంలోని బీజేపీ మాత్రం మత రాజకీయాలు చేస్తోందని మండి పడ్డారు.