ఇండియన్ సినీ ఇండస్ ట్రీపై తనదైన ముద్ర వేసిన కన్నడ రెబల్ స్టార్ అంబరీష్ అనారోగ్యం తో కన్నుమూశారు. గత కొంత కాలంగా కిడ్నీ మరియు శ్వాసకోశ వ్యాదితో బాధపడుతున్న అంబరీష్ బెంగళూరులో ని ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్యం మరింత క్షీణించడంతో హాస్పిటల్ లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. 66 ఏళ్ల అంబరీష్ దక్షిణ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా ఎదిగి, ప్రస్తుతం కన్నడ సినిమా పరిశ్రమకు పెద్ద దిక్కుగా నిలిచారు.
అప్పట్లో మైసూర్ రాష్ట్రం మాండ్య జిల్లాలో జన్మించిన అంబరీష్ అసలు పేరు గౌడ అమర్ నాథ్. 1972లో ‘నాగరాహవు’ అనే చిత్రంతో ఎంట్రీ ఇచ్చి దాదాపుగా 200 పై చిలుకు చిత్రాల్లో నటించారు. 1991లో తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన, తెలుగు మహిళ సుమలతను వివాహం చేసుకోవడం వల్ల, తెలుగు వారి అల్లుడిగా అంబరీష్ మారిపోయారు. సినిమ పరిశ్రమలోనే కాకుండా రాజకీయాల్లో కూడా రాణించి కర్ణాటక రాజకీయాల్లో కీక పాత్ర పోషించిన విషయం తెల్సిందే.
కేంద్ర మంత్రిగా కూడా చేసిన అంబరీష్ మరణంతో సినీ మరియు రాజకీయ వర్గాలు శోఖ సంద్రంలో మునిగి పోయాయి. జాతీయ స్థాయి కాంగ్రెస్ నేతలతో పాటు, పలువురు బాలీవుడ్ ప్రముఖు మరియు సౌత్ సినీ దిగ్గజాలు అంబరీష్ కు తుది నివాళ్లు అర్పించేందుకు బెంగళూరు చేరుకుంటున్నారు. తెలుగు సినీ ప్రముఖులు పలువురు అంబరీష్ మరణంకు తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు.