Begin typing your search above and press return to search.

ప్ర‌ముఖ న‌టుడ్ని ప‌ట్టుకునే వేట‌లో పోలీసులు

By:  Tupaki Desk   |   5 Jun 2018 4:44 AM GMT
ప్ర‌ముఖ న‌టుడ్ని ప‌ట్టుకునే వేట‌లో పోలీసులు
X
త‌న‌కు మాలిన ధ‌ర్మం అన్న చందంగా.. త‌న‌కు స‌న్నిహితుడైన నిర్మాత‌ను కాపాడేయ‌త్నంలో చిక్కులో ప‌డ్డాడు ఒక ప్ర‌ముఖ హీరో. అయితే.. ఈ ప్ర‌ముఖ న‌టుడు టాలీవుడ్‌ కి చెందిన వాడు కాదు.. తెలుగు రాష్ట్రాల‌కు చెంత‌నే ఉన్నా క‌న్న‌డ సినిమాల్లో పేరున్న ఈ న‌టుడు మ‌రెవ‌రో కాదు దునియా విజ‌య్‌.

చిన్న చిన్న పాత్ర‌ల‌తో మొద‌లై త‌క్కువ వ్య‌వ‌ధిలో అగ్ర న‌టుడిగా అవ‌త‌రించిన విజ‌య్ ఇప్పుడు తీవ్ర ఇబ్బందిలో ప‌డ్డారు. ఒక కేసులో అరెస్ట్ కావాల్సిన నిర్మాత‌ను కాపాడేందుకు పోలీసుల‌కు మ‌స్కా కొట్టి మ‌రీ.. స‌ద‌రు నిర్మాత త‌ప్పించుకునేందుకు స‌ద‌రు న‌టుడు సాయం చేశారు. ఊహించ‌ని రీతిలో సినిమాటిక్ గా సాయం చేసిన దునియా విజ‌య్ తీరుపై పోలీసులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

నేర‌స్తుడు పారిపోయేందుకు సాయం చేసిన న‌టుడిపై చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు చేప‌ట్టారు పోలీసులు. విజ‌య్ ను అరెస్ట్ చేసేందుకు అనుమ‌తులు పొందారు. ఈ విష‌యం తెలుసుకున్న దునియా విజ‌య్ ప‌రార‌య్యారు. ఇప్పుడాయ‌న ఆచూకీ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.

ఈ ఎపిసోడ్‌ లో నిర్మాత సుంద‌ర్ గౌడ్‌ కు సాయం చేసి.. అనవ‌స‌రంగా లేని వివాదంలో దునియా విజ‌య్ ఇరుక్కున్న‌ట్లు చెప్ప‌క త‌ప్ప‌దు. చేసిన త‌ప్పున‌కు చెంప‌లు వేసుకోవాల్సింది పోయి.. త‌ప్పు మీద త‌ప్పు చేస్తున్న వైనం హాట్ టాపిక్ గా మారింది. ఈసారి పోలీసుల‌కు చిక్కితే దునియా విజ‌య్ కు ఇబ్బందులు త‌ప్ప‌వ‌ని చెబుతున్నారు. పోలీసులు అదుపులోకి తీసుకునే లోపే.. త‌న‌కు తానుగా చ‌ట్టం ముందు లొంగిపోతే.. అత‌గాడు చేసిన త‌ప్పులు కొంత‌మేర‌కు క‌రెక్ట్ చేసుకునే వెసులుబాటు ఉంటుంద‌ని చెబుతున్నారు. అందుకు భిన్నంగా పోలీసుల‌కు చిక్కితే మాత్రం మ‌రిన్ని చిక్కులు త‌ప్ప‌వ‌ని తెలుస్తోంది.