Begin typing your search above and press return to search.
అంతా ఊహించినట్టే.. కన్నా కీలక నిర్ణయం!
By: Tupaki Desk | 16 Feb 2023 11:52 AM GMTఏపీ బీజేపీకి తీవ్ర షాక్ తగిలింది. మాజీ మంత్రి, ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఆయనతోపాటు పలువురు ముఖ్య నేతలు కూడా పార్టీని వీడారు. గత కొంతకాలంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వ్యవహార శైలిపై కన్నా గుర్రుగా ఉన్నారు. తాను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నియమించిన 8 జిల్లాల అధ్యక్షులను సోము వీర్రాజు తొలగించారని.. ఈ విషయంలో తనకు మాట మాత్రం చెప్పలేదని కన్నా గతంలోనే వ్యాఖ్యానించారు. అలాగే రాష్ట్ర కార్యకలాపాల విషయంలో చివరి నిమిషం వరకు తనకు సమాచారం ఉండటం లేదని కన్నా అసంతృప్తి వ్యక్తం చేశారు.
కన్నా పార్టీకి రాజీనామా చేస్తారని.. ఆయన జనసేన పార్టీ తీర్థం పుచ్చుకుంటారని వార్తలు రాగానే ఇటీవల బీజేపీ అధిష్టానం అప్రమత్తమైంది. బీజేపీ జాతీయ కార్యనిర్వహణ కార్యదర్శి శివ్ ప్రకాష్ జీని కన్నాతో చర్చలకు పంపింది. శివ ప్రకాష్ జీ విజయవాడ వచ్చి కన్నా లక్ష్మీనారాయణను బుజ్జగించారు. దాదాపు రెండు గంటలపాటు కన్నా లక్ష్మీనారాయణ చెప్పిన విషయాలన్నీ శివ ప్రకాష్ జీ విన్నారు. ఆ సమయంలో మీడియాతో మాట్లాడిన కన్నా తాను ఏ పార్టీ మారడం లేదని.. తనపై మీడియా అసత్య కథనాలను ప్రసారం చేస్తోందని మండిపడ్డ సంగతి తెలిసిందే.
ఎట్టకేలకు ఆయన బీజేపీని వీడారు. 2019 ఎన్నికల ముందు కన్నా లక్ష్మీనారాయణ కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. ఆయనతోపాటు ఆయన అనుచరులు, కాంగ్రెస్ పార్టీకి చెందిన చాలా మంది నేతలు కన్నాతోపాటు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. దాదాపు రెండేళ్లు బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న కన్నాను ఆ పదవి నుంచి తప్పించి సోము వీర్రాజుకు బీజేపీ రాష్ట్ర పగ్గాలను ఆ పార్టీ అధిష్టానం అప్పగించింది. ఈ నేపథ్యంలో కన్నా లక్ష్మీనారాయణను జాతీయ స్థాయి పార్టీ పదవిలోకి తీసుకుంటారని వార్తలు వచ్చినా అవి నిజం కాలేదు. దీంతో కన్నా పార్టీకి తాజాగా రాజీనామా చేశారు.
కాగా దివంగత నేత వంగవీటి రంగా అనుచరుడిగా రాజకీయాల్లోకి ప్రవేశించిన కన్నా లక్ష్మీనారాయణ తొలిసారి 1989లో గుంటూరు జిల్లా పెదకూరపాడు నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత 1994, 1999, 2004ల్లోనూ పెదకూరపాడు నుంచి విజయం సాధించారు.
2009లో గుంటూరు పశ్చిమ నుంచి గెలిచారు. మొత్తం వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా కన్నా గెలుపొందారు. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, కోట్ల విజయభాస్కరరెడ్డి, వైఎస్ రాజశేఖరరెడ్డి, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గాల్లో కన్నా లక్ష్మీనారాయణ మంత్రిగా పనిచేశారు. 2014లో కాంగ్రెస్ తరఫున గుంటూరు పశ్చిమ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2019లో ఆయన పోటీ చేయలేదు.
కాగా వచ్చే ఎన్నికల్లో సత్తెనపల్లి నుంచి లేదా గుంటూరు పశ్చిమ నుంచి కన్నా లక్ష్మీనారాయణ పోటీ చేస్తారని వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు ఆయన జనసేన పార్టీ తీర్థం పుచ్చుకుంటారని చెబుతున్నారు. పవన్ కల్యాణ్ కు అనుకూలంగా ఇటీవల కాలంలో కన్నా వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే.