Begin typing your search above and press return to search.

కన్నా ‘వివక్ష’ కలకలం

By:  Tupaki Desk   |   13 July 2015 5:44 AM IST
కన్నా ‘వివక్ష’ కలకలం
X
దివంగత మహానేత వైఎస్ కు అత్యంత సన్నిహితుడిగా.. పదేళ్లు సాగిన కాంగ్రెస్ సర్కారులో పదేళ్లు మంత్రిగా.. కీలకభూమిక పోషించిన కన్నా లక్ష్మీనారయణ.. విభజన నేపథ్యంలో హస్తానికి గుడ్ బై చెప్పేసి.. బీజేపీలో చేరటం తిలిసిందే.

గత కొందకాలంగా మౌనంగా ఉన్న ఆయన తాజాగా గళం విప్పారు. సాధారణంగా మౌనంగా ఉండి.. గళం విప్పిన సమయంలో ఏదైనా పెద్ద ఇష్యూ ఉండటం సహజం. అలాంటిదేమీ లేకుండా.. మిత్రుడు హోదాలో ఉన్న తమ పట్ల వివక్ష ప్రదర్శిస్తున్నారని.. చిన్నచూపు చూస్తున్నారంటూ కన్నా లక్ష్మానారాయణ గళం విప్పారు.

ఏపీలో దేవాదాయ శాఖా మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న మాణిక్యాలరావు పట్ల ఏపీ సీఎం వివక్ష ప్రదర్శిన్నారంటూ కన్నా ఆరోపిస్తున్నారు. దేవాదాయ శాఖా మంత్రి మాణిక్యాలరావుకు పుష్కరాల సందర్భంగా బాధ్యతలు అప్పగించకుండా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని.. తమ పార్టీ నేతను చిన్నచూపు చూస్తూన్నారంటూ మండిపడటమే కాదు.. మిత్రపక్షం పట్ల ఇలాంటి వైఖరి ఏ మాత్రం సరికాదని చెబుతున్నారు. నొప్పి కలిగిన మంత్రిగారి నోటి నుంచి మాటలు రాకున్నా.. ఆయన పక్కనున్న వారు మాత్రం చెలరేగిపోవటం గమనార్హం.