Begin typing your search above and press return to search.
అవసరాన్ని బట్టి కాపులను వాడుకుంటున్నారు: కన్నా సంచలన వ్యాఖ్యలు!
By: Tupaki Desk | 10 Feb 2023 7:00 PM GMTబీజేపీ ఏపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో 22 శాతం ఉన్న కాపులు ఎటు ఉంటే అటు అధికారం దక్కుతుందన్నారు. ఈ విషయం 1989 నుంచి నిరూపితమవుతోందని చెప్పారు. ఎన్నికల సమయంలోనే ఓట్లు అవసరం కాబట్టి కాపులను వాడుకుంటారని కన్నా సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో అత్యధిక శాతం ఉన్న కాపులను వాడుకునే ప్రయత్నం ప్రతిసారి జరుగుతోందని కన్నా లక్ష్మీనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు.
కాపులకు రిజర్వేషన్ల డిమాండ్ సుదీర్ఘ కాలం నుంచి ఉందని గుర్తు చేశారు. చాలా మంది నాయకులు రిజర్వేషన్‌ల కోసం పోరాటాలు చేశారని తెలిపారు. కాపులకు రిజర్వేషన్‌లు ఇవ్వాలని తాను కూడా కోరుకుంటున్నానన్నారు. గతంలో మిరియాల వెంకట్రావు, కేంద్ర మాజీ మంత్రి పి.శివశంకర్ తదితరులు కాపుల సంక్షేమం కోసం నిజాయతీగా కృషి చేశారని కొనియాడారు. కాపులకు రాజకీయ దిశను నిర్దేశించేంత శక్తి తనలో లేదన్నారు.
1994లో కాపుల స్కాలర్ షిప్‌లకు సంబంధించి కోట్ల విజయభాస్కర రెడ్డి జీవో ఇచ్చారని గుర్తు చేశారు. అయితే ఆయన బీసీ సంక్షేమ శాఖ తరపున జీవో ఇవ్వటంతో స్కాలర్ షిప్పులు అమలు కాలేదని కన్నా ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా కాపు రిజర్వేషన్ అంశం తెరపైకి వచ్చిందన్నారు. కాపుల సామాజిక, ఆర్థిక సర్వే కోసం వైఎస్ చర్యలు చేపట్టారని తెలిపారు. చంద్రబాబు హయాంలో ఈబీసీ కోటాలో కాపులకు రిజర్వేషన్లు వచ్చేలా నిర్ణయం తీసుకున్నారని గుర్తు చేశారు. కాపులకు రిజర్వేషన్ల అంశాన్ని చంద్రబాబు పూర్తి చేశారని వెల్లడించారు.
పవన్ కళ్యాణ్ తొమ్మిదేళ్ల క్రితం పార్టీ పెట్టారని... జనసేన పార్టీని బయట నుంచి ఎవ్వరూ ప్రభావితం చేయకుండా చూడాలని ఆయనకు విన్నవించారు. జనసేనను అధికారంలోకి తీసుకురావటంపై పవన్ కల్యాణ్ నిర్ణయానికి వదిలేస్తే మంచిదని అభిప్రాయపడ్డారు.
బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఏం సాధించారని కాపులతో సన్మానాలు చేయించుకుంటున్నారో అర్థం కావడం లేదని మండిపడ్డారు. కాపుల గురించి జీవీఎల్ పార్లమెంటులో అడిగిన సమాచారం గూగుల్ లో కొట్టినా వస్తోందని కన్నా లక్ష్మీనారాయణ ఎద్దేవా చేశారు.
కేంద్ర ప్రభుత్వం ఓబీసీ రిజర్వేషన్లకు చట్ట సవరణ చేసి రిజర్వేషన్లపై రాష్ట్రాలకే అధికారం ఇచ్చిందన్నారు. దాన్ని ఆధారంగా చేసుకుని రాష్ట్రంలో ఓబీసీ కోటాలో కాపులకు రిజర్వేషన్లు ఇప్పిస్తే బాగుంటుందని కన్నా ఆకాంక్షించారు.
ఇపుడు కన్నా వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. ఇటీవల బీజేపీ రాష్ట్ర సోము వీర్రాజుతో విభేదించిన కన్నా ఆ పార్టీతో అంటీముట్టునట్టు ఉన్న విషయం తెలిసిందే. జనసేన పార్టీలో చేరతారనే వార్తలు వచ్చాయి. ఈలోపు బీజేపీ అధిష్టానం తరఫున శివ ప్రకాష్ జీ విజయవాడ వచ్చి కన్నాతో భేటీ అయ్యారు. కన్నా చెప్పిన అన్ని అంశాలను సావధానంగా విన్నారు. ఈ నేపథ్యంలో కన్నా కూడా తాను వేరే పార్టీలో చేరతానని చెప్పలేదన్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.