Begin typing your search above and press return to search.

మహాత్మాగాంధీపై కంగనా రౌనత్ కామెంట్స్

By:  Tupaki Desk   |   13 March 2021 2:37 AM GMT
మహాత్మాగాంధీపై కంగనా రౌనత్ కామెంట్స్
X
టాలీవుడ్ సెల‌బ్రిటీ కోడ‌ళ్లు ఇలా క‌లిసే షికార్ వెళ్లారా?.. మెగా నంద‌మూరి అభిమానుల ధ‌ర్మ సందేహ‌మిది. అయితే అందుకు స‌మాధానం కావాలంటే డీప్ గా మ్యాట‌ర్ లోకి వెళ్లాల్సిందే.

టాలీవుడ్ మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ .. నంద‌మూరి టైగ‌ర్ ఎన్టీఆర్ మ‌ధ్య స్నేహం గురించి తెలిసిందే. ఆ ఇద్ద‌రూ క‌లిసి ఫ్యామిలీ ఈవెంట్ల‌కు హాజ‌ర‌య్యారు. ప‌రిశ్ర‌మ‌లో చాలా కాలంగా స్నేహం కొన‌సాగిస్తున్నారు. ఒక‌రి సినిమాల‌కు ఒక‌రు ప్ర‌చారం చేస్తారు. ఇక క‌లిసే ఆర్.ఆర్.ఆర్ లాంటి భారీ పాన్ ఇండియా చిత్రంలో న‌టిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ సినిమా జాతీయ అంత‌ర్జాతీయ‌ స్థాయిలో చ‌ర్చ‌కు వ‌స్తోంది. ఎస్.ఎస్. రాజ‌మౌళి ఆ ఇద్ద‌రినీ ఒకేసారి పాన్ ఇండియా స్టార్లుగా తీర్చిదిద్దుతుంటే అభిమానులు ఆగ‌లేకున్నారు. ఆర్.ఆర్.ఆర్ పెద్ద తెర‌పైకి ఎప్పుడొస్తుందా.. అన్న ఆస‌క్తి అంద‌రిలో నెల‌కొంది.

ఇదంతా ఒకెత్తు అనుకుంటే ఆ ఇద్ద‌రూ ఫ్యామిలీ వెకేష‌న్స్ కి ప్లాన్ చేస్తున్నార‌న్న‌ది తాజా గుస‌గుస‌. మ‌రోవైపు మెగా కోడ‌లు ఉపాస‌న కొణిదెల .. నంద‌మూరి కోడ‌లు ప్ర‌ణ‌తి మ‌ధ్య స్నేహం అంతే ఇదిగా చ‌ర్చ‌కు వ‌స్తోంది. ఆ ఇద్ద‌రూ త‌మ కుటుంబ ఈవెంట్ల‌లో రెగ్యుల‌ర్ గా క‌లుస్తుంటారు.

తాజాగా వేర్వేరు సంద‌ర్భాల్లో ఔటింగ్ కి వెళ్లిన ఫోటోల్ని క‌లిపి అభిమానులు సోష‌ల్ మీడియాల్లో వైర‌ల్ చేయ‌డం హాట్ టాపిక్ గా మారింది. జూబ్లీ హిల్స్ కేబీఆర్ పార్క్ ప‌రిస‌రాల్లోని కాఫీ కేఫ్ ల‌కు వెళ్లిన‌ప్ప‌టి ఫోటోలు ఇవ‌ని అర్థ‌మ‌వుతోంది. ఇక ఎన్టీఆర్ భార్య ల‌క్ష్మీ ప్ర‌ణ‌తి ఒక ప్రొఫెష‌న‌ల్ ఫోటోగ్రాఫ‌ర్ త‌ర‌హాలో మెడ‌లో హ్యాండ్ బ్యాగ్ ని ధ‌రించ‌డం ఆస‌క్తిక‌రం. ఇది `హాఫ్ వైట్` అనే విదేశీ బ్రాండ్ లెద‌ర్ బ్యాగ్. దీని వెల $1200 నుంచి $1600 డాల‌ర్లు ఉంటుంది. అంటే సుమారు ల‌క్ష రూపాయ‌ల పైమాటే. ఉపాస‌న కొణిదెల సింపుల్ పింక్ లెద‌ర్ హ్యాండ్ బ్యాగ్ తో స్టైలిష్ గా ఫార్మ‌ల్ లుక్ లో ప్ర‌త్య‌క్ష‌మ‌య్యారు.