Begin typing your search above and press return to search.

ఆ వీడియోలు చూసే ధైర్యం లేదన్న కంగనా రనౌత్

By:  Tupaki Desk   |   30 Jun 2022 4:12 AM GMT
ఆ వీడియోలు చూసే ధైర్యం లేదన్న కంగనా రనౌత్
X
ఉదయ్ పూర్లో జరిగిన టైలర్ హత్యతో దేశ వ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఈ సంఘటనతో సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రత పెంచారు. పోలీసు అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ అవసరమైన చోట బలగాలను మోహరిస్తున్నారు. ఈ సందర్భంగా కొందరు ప్రముఖులు ఈ హత్యను ఖండిస్తున్నారు. టైలర్ ను హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలడి డిమాండ్ చేస్తున్నారు. తాజాగా సినీ నటి కంగనా రానౌత్ ఈ విషయంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. హత్యకు సంబంధించిన వీడియో చూసే ధైర్యం లేదని ఎందుకంటే నా మెదడు మొద్దుబారిపోయిందని అన్నారు. ఆ దారుణమైన వీడియోలను నేను చూడలేని చెప్పుకొచ్చారు.

రాజస్తాన్ రాష్ట్రంలోని ఉదయ్ పూర్ కు చెందిన కన్హయ్య లాల్ అనే వ్యక్తి టైలర్ గా వృత్తి కొనసాగిస్తూ జీవిస్తున్నాడు. ఇటీవల బీజేపీ నుంచి బహిష్కరించబడ్డ నుపుర్ శర్మ ఓ వర్గంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

అయితే కన్హయ్య లాల్ ఆమె చేసిన వ్యాఖ్యలను సమర్థించారు. అంతేకాకుండా ఆమెకు సంబంధించిన ఫొటోను ఫోన్ స్టేటస్ లో పెట్టుకున్నారు. దీంతో కొందరు ఆయన టైలర్ షాప్ కు వెళ్లి మరీ హత్య చేశారు. ఇంకెవరైనా ఇలాగే చేస్తే వారికి ఇదే గతి పడుతుందంటూ వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. దీంతో ఈ సంఘటనపై దేశవ్యాప్తంగా కలకలం రేపింది.

ఈ సంఘటనను బీజేపీ నాయకులు ఖండిస్తున్నారు. హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతున్నారు. ఈ తరుణంలో దీనిపై పలువురు ప్రముఖులు స్పందిస్తున్నారు.

తాజాగా సినీ నటి కంగనా రానౌత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కన్హయ్య లాల్ హత్యకు సంబంధించిన వీడియో చూసే ధైర్యం లేదని అన్నారు. ఆ వీడియో చూడడానికి నా మెదడు సహకరించడం లేదని అన్నారు. కాగా గతంలో నుపుర్ శర్మ వ్యాఖల్యు కంగనా రానౌత్ మద్దతు ఇచ్చిన విషయం తెలిసిందే.

ఇదిలా ఉండగా ఈ హత్యపై దేశం అలర్డ్ అయింది. సున్నిత ప్రాంతాల్లో బలగాలను మోహరించారు. ఎక్కడా అవాంచనీయ సంఘటలను జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. అవసరమైన చోట ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నారు. తెలంగాణలోని హైదరాబాద్ లో కూడా పోలీసులు అప్రమత్తమయ్యారు. చార్మినార్ లాంటి సమస్యాత్మక ప్రాంతాల్లో ఇప్పటికే పోలీసులు మోహరించారు. భారీగా భద్రత పెంచి తనిఖీలు నిర్వహిస్తున్నారు. అనుమానం వచ్చిన వారిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.