Begin typing your search above and press return to search.
చంద్రబాబుకు అప్పుడే ఒక రెబెల్ రెడీ
By: Tupaki Desk | 10 Feb 2018 2:10 PM GMTవచ్చే ఎన్నికలకు సీట్ల పెంపు లేదని దాదాపు ఖరారు కావడంతో టీడీపీలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఉన్న చోట పాత కాపులు తమతమ వ్యూహాలు రచించుకుంటున్నారు. కొందరు వైసీపీ వైపు చూస్తుంటే మరికొందరు రెబెల్ గా పోటీచేయడానికి రెడీ అవుతున్నారు. అనంతపురం జిల్లా కదిరిలో ఇప్పుడు అదే పరిస్థితి ఉందంటున్నారు. అక్కడ వైసీపీ నుంచి ఫిరాయించిన అత్తార్ చాంద్ బాషాకు చంద్రబాబు టీడీపీ టిక్కెట్ ఇవ్వడం దాదాపు ఖరారు కావడంతో ఎప్పటినుంచో ఆ నియోజకవర్గాన్ని నమ్ముకున్న కందికుంట ప్రసాద్ తన భార్యతో ఇండిపెండెంట్ గా పోటీచేయించడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. అందులో భాగంగా ఆమె నియోజకవర్గ పర్యటనలు ప్రారంభించినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం కందికుంట ప్రసాద్ కదిరి టీడీపీ ఇన్‌చార్జ్ గా ఉన్నారు. అయితే... ఆయనపై పోలీసు కేసులున్నాయి. నకిలీ డీడీలతో బ్యాంకులను మోసం చేసిన కేసులో ఆయనకు ఇటీవల జైలు శిక్ష కూడా పడింది. దాంతో ఎన్నికల్లో పోటీకి ఆయన అనర్హుడయ్యారు. దీంతో చాంద్ బాషాకే టిక్కెట్ ఖరారైనట్లు చెప్తున్నారు.
కానీ కందికుంట ప్రసాద్ మాత్రం ఏమాత్రం వెనక్కు తగ్గడం లేదట. తనకు బదులు భార్యకు టిక్కెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారట. అందుకు అధిష్ఠానం నుంచి సానుకూలత రాకపోవడంతో తన భార్య యశోదమ్మను రంగంలోకి దించుతున్నారట. ఇప్పటికే ప్రజల్లోకి వెళ్తున్న ఆమె ఒకవేళ టిక్కెట్ రాకుంటే ఇండిపెండెంటుగా బరిలో ఉంటామని డైరెక్టుగా చెప్తున్నారట. సో... చంద్రబాబుకు అప్పుడే ఒక రెబెల్ రెడీ అయినట్లే.