Begin typing your search above and press return to search.
మరో షాక్: కంచి పీఠాధిపతి శివైక్యం!
By: Tupaki Desk | 28 Feb 2018 4:49 AM GMTషాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఆదివారం తెల్లవారుజామున శ్రీదేవి మరణ వార్తతో యావత్ దేశం షాక్ తిన్న పరిస్థితి. ఆమె మరణం మీద ట్విస్టుల మీద ట్విస్టులతో చూస్తుండగానే రెండు రోజులు గడిచిపోయాయి. శ్రీదేవి మరణంపై నెలకొన్న సందేహాలకు పుల్ స్టాప్ పెడుతూ.. దుబాయ్ అధికారులు కేసు క్లోజ్ చేసిన శ్రీదేవిని పంపించటం.. ఆమె పార్థిపదేహం నిన్న రాత్రి (మంగళవారం) ముంబయికి చేరుకోవటం తెలిసిందే.
ఈ రోజు మధ్యాహ్నం ఆమె అంత్యక్రియలు మొదలు కానున్నాయి. ఇదిలా ఉంటే.. దక్షిణాదికి చెందిన మరో పెద్దమనిషి.. అధ్యాత్మిక వేత్త.. కంచి పీఠాన్ని ఆరాధించే వారికి భారీ షాక్ ను ఇచ్చేలా కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి స్వర్గస్తులయ్యారు.
1935 జులై 18న తమిళనాడులోని తంజావూరులో జన్మించిన జయేంద్ర.. కంచి పీఠాధిపతిగా వ్యవహరిస్తున్నారు. గడిచిన కొంతకాలంగా శ్వాససంబంధమైన వ్యాధితో బాధపడుతున్న ఆయన.. కాంచీపురంలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ రోజు ఉదయం ఆయన తుదిశ్వాస విడిచి శివైక్యం అయినట్లుగా వెల్లడించారు. కంచి పీఠాధిపతి మరణంతో పలువురు భక్తులకు షాకింగ్ గా మారింది.