Begin typing your search above and press return to search.

కేసీఆర్ ది ముమ్మాటికి దొరల పాలనే అన్న మేధావి

By:  Tupaki Desk   |   28 Oct 2015 5:00 PM IST
కేసీఆర్ ది ముమ్మాటికి దొరల పాలనే అన్న మేధావి
X
తెలంగాణ రాష్ట్రంలో అత్యంత మేధావుల్లో ఒకరిగా చెప్పే కంచె ఐలయ్య.. తెలంగాణ రాష్ట్ర సర్కారుపై ఘాటైన విమర్శలు చేశారు. నిజానికి ఆయన విమర్శల్లో తెలంగాణ ముఖ్యమంత్రితో పాటు.. దేశ ప్రధాని మోడీ పైనా విమర్శలు సంధించారు. సంగారెడ్డిలో జరిగిన ఒక సెమినార్ లో పాల్గొన్న ఆయన.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనపై నిశితంగా విమర్శలు చేశారు. ఓవైపు తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకొని చస్తుంటే.. పట్టించుకోవటం లేదని మండిపడ్డారు.

ప్రజలు చస్తుంటే బతుకమ్మలు.. యాగాలు చేస్తూ దొరల పాలనను సాగిస్తున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మతానికి సంబంధించిన పండుగలు ప్రభుత్వాలు చేయటం ఎక్కడా చూడలేదని.. కేసీఆర్ పాలనలో మళ్లీ భూస్వామ్య వ్యవస్థను తీసుకొచ్చారని మండిపడ్డారు. కేసీఆర్ మీద నిప్పులు చెరిగిన ఆయన.. ప్రధాని మోడీని వదిలిపెట్టలేదు. దేశాన్ని మోడీ.. శాఖాహార భారత్ గా మార్చాలని చూస్తున్నారన్నారు. వెజిటబుల్ భారత్ ను నిర్మించేందుకు మోడీ తపిస్తున్నారని.. మతోన్మాది మాదిరి వ్యవహరిస్తున్నారన్నారు. సర్దార్ పటేల్ ప్రధాని అయితే దేశం మరింత ప్రగతి సాధించి ఉండేదన్న మోడీ మాటల్ని ఐలయ్య తప్పు పట్టారు.

పటేల్ కానీ దేశ ప్రధాని అయి ఉంటే.. భారత్ హిందూ దేశం అయ్యేదని.. నెహ్రూ సోషలిస్టు భావాలున్న వ్యక్తిగా ఐలయ్య అభివర్ణించారు. అంబేడ్కర్ కానీ రాజ్యాంగాన్ని రచించి ఉండకపోతే.. దేశంతో సమానత్వ భావన వచ్చేది కాదన్న ఐలయ్య.. మోడీ విధానాల్ని తీవ్రంగా తప్పు పట్టారు. మేధావి విమర్శలపై టీఆర్ఎస్.. బీజేపీ నేతలు ఎలా స్పందిస్తారో..?