Begin typing your search above and press return to search.

ఏపీ బీజేపీలో కాపు వర్సెస్ కమ్మ.. డిష్యూం.. డిష్యూం!

By:  Tupaki Desk   |   15 Aug 2020 1:00 PM GMT
ఏపీ బీజేపీలో కాపు వర్సెస్ కమ్మ.. డిష్యూం.. డిష్యూం!
X
ఏపీలో బలమైన సామాజికవర్గాలుగా కమ్మ, రెడ్లు, కాపులున్నారు. ఇప్పుడు ఈ మూడు సామాజిక వర్గాలకు చెందిన వ్యక్తుల చేతుల్లోనే ఏపీ రాజకీయం నడుస్తోంది. అయితే ఈ మధ్య టీడీపీ కమ్మలు.. అవసరార్థం బీజేపీలో చేరడం.. అక్కడ ఆధిపత్యం చెలాయించడానికి చూశారు. అయితే కొత్తగా బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు వచ్చాక కమ్మ నేతల పరపతి పనిచేయడం లేదన్న టాక్ ఆ పార్టీ వర్గాల్లో నడుస్తోంది. అందుకే సోముకు వీరంతా ముఖం చాటేస్తున్నట్టు కనిపిస్తోందంటున్నారు.

ఏపీ బీజేపీ కొత్త అధ్యక్షుడు సొము వీర్రాజు బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి ఏపీ బీజేపీలో ఉన్న హేమాహేమీలు రాలేదు. కామినేని శ్రీనివాస్, మాజీ ఎంపీ హరిబాబు మరియు సుజనాచౌదరి లాంటి బీజేపీ కీలక నేతలు ముఖం చాటేశారు.

వీళ్లంతా సుజనాచౌదరి టీంలో ఉండి రాలేదు అని.. అసలు సోము వీర్రాజుకి గ్రౌండ్ లెవల్లో ఏమాత్రం బలం లేదు కదా అని పాత బీజేపీ నాయకులు ఫీలింగ్ అంట.. ఇప్పుడు బీజేపీలో కమ్మ వర్సెస్ కాపు లా వ్యవహారం నడుస్తోందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇలా పంచాయితీ పెట్టుకొని ఇగోలతో కలిసి రాకుంటే అసలు బీజేపీకి 1శాతం ఓట్లు అయినా వస్తాయా అని ఒక డౌట్ ను కిందిస్థాయి నేతలు వెలుబుచ్చుతున్నారు.