Begin typing your search above and press return to search.

కమ్మ ఫ్యాక్టర్...తగ్గేదిలే ...?

By:  Tupaki Desk   |   3 Dec 2021 2:30 AM GMT
కమ్మ ఫ్యాక్టర్...తగ్గేదిలే ...?
X
ఏపీలో రాజకీయం అంటే కులాల కుంపటి అన్న సంగతి తెలిసిందే. కులాల లెక్కన ఓట్లను చూసుకుంటూ పాలిటిక్స్ చేస్తేనే సేఫ్ అన్న ధోరణి ఉంది. ఇది అంతకంతకు పెరిగిపోతోంది తప్ప ఎక్కడా ఆగడంలేదు. ఇదిలా ఉంటే ఏపీలో బలమైన సామాజికవర్గంగా కమ్మలకు అగ్రాసనమే వేస్తారు. జనాభా పరంగా ఇంతకన్నా నాలుగు రెట్లు ఉన్న కులాలు ఎన్నో ఉండొచ్చు. కానీ ఎన్నో సార్లు అధికారంలోకి రావడమే కాకుండా సోషల్ ఇంజనీరింగ్ చేయడంతో పండిపోయిన కమ్మలకు అధికారం అన్నది అలా దక్కుతూనే ఉంది.

ఇక 2019 ఎన్నికలు కమ్మలకు పీడకలగానే మారాయి. రాజకీయ పందెం కాసిన టీడీపీ ఓడిపోయింది. ఇక రెండున్నరేళ్ళుగా చూసుకుంటే టీడీపీ గ్రాఫ్ పెంచే ప్రయత్నాలు జరుగుతున్నాయి కానీ ఆశించిన తీరులో సాగడంలేదు. దాంతో కమ్మ సామాజిక వర్గం ఈసారి న్యూ స్ట్రాటజీస్ తో ముందుకు వస్తోంది అంటున్నారు. కార్తీక సమారాధనల పేరిట ఈ మధ్య పలు చోట్ల ఆ సామాజిక వర్గం పెద్దలు సమావేశమైనపుడు రాజకీయ భవిష్యత్తు గురించే ఎక్కువగా చర్చలు జరిగినట్లుగా చెబుతున్నారు. కమ్మలు అన్ని రంగాలలో ఉన్నారు. వారికి రాజకీయ అండ చాలా అవసరం.

ఇపుడు చూస్తే రెండు రాష్ట్రాలలో రాజకీయం వారి చేతుల నుంచి జారింది. తెలంగాణాలో టీయారెస్ ఓడితే కాంగ్రెస్ కానీ మరో పార్టీ కానీ అధికారంలోకి వస్తుంది. అక్కడ టీడీపీ ఉనికి లేకుండా పోయింది. ఇక ఏపీలో చూసుకుంటే వైసీపీ దూకుడు చేస్తోంది. దాన్ని తట్టుకుని నిలబడాలీ అంటే కష్టమవుతోంది. ఇక 2019 ముందు వరకూ తీసుకుంటూ ఎక్కడో ఒక చోట అధికారంలో టీడీపీ ఉండేది. దానికి ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉమ్మడి ఏపీని ఏలినా కమ్మలకు రాజకీయంగా ఇతరత్రా పెను సవాళ్ళు ఎదురుకాలేదు.

అయితే ఇపుడు మాత్రం వారిని అన్ని రకాలుగా ఇబ్బందులు కట్టకట్టుకుని వచ్చేశాయి. దాంతో ఆ సామాజికవర్గం మధనపడుతోంది. అంతే కాదు, 2024 ఎన్నికల నాటికి మొత్తానికి మొత్తం సామాజికవర్గాన్ని కన్సాల్డేట్ చేయడమే కాకుండా టీడీపీకి బ్యాక్ బోన్ గా నిలవాలని చూస్తోంది. టీడీపీని గెలిపించుకోవడం జీవన్మరణ సమస్యగా ఆ సామజికవర్గం భావించడం ఇక్కడ విశేషంగా చెప్పుకోవాలి. కమ్మలు అన్ని పార్టీలలో ఉన్నా కూడా వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం విజయానికి సహకారం అందించడం తధ్యమన్న ప్రచారం కూడా సాగుతోంది.

ఇక పెద్దన్న పాత్రలో కమ్మలు ఉండి మిగిలిన సామాజిక వర్గాలను కూడా అక్కున చేర్చుకోవడం ద్వారా ఏపీలో టీడీపీని అధికారంలోకి తేవాలని చూస్తున్నారు. ఏపీలో కాపులు, బీసీలు, వైసీపీతో విసిగిన రెడ్లు, కొన్ని అగ్ర కులాలు ఇలా అందరినీ టీడీపీ ఆద్వర్యాన ఒక గొడుకు కిందకు తేవాలన్నదే కమ్మ వారి ఆలోచనగా ఉంది. అంటే సోషల్ ఇంజనీరింగ్ అన్న మాట. టీడీపీ కమ్మలకు కేరాఫ్ పాలిటిక్స్ గా ఉంది. ఆ పార్టీని గెలిపించుకోకపోతే రేపటి రోజున రాజకీయంగానే కాకుండా అన్ని విధాలుగా ఇబ్బంది ఎదురవుతుంది అన్నదే ఆ సామాజికవర్గం ఆలోచనగా కనిపిస్తోంది.

ఈ నేపధ్యంలో తమకు ఎదురు నిలిచి సొంత సామాజికవర్గంలో చిచ్చు పెడుతున్న వారిగా ఉన్న మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే వల్లభనేని వంశీ లాంటి వారిని పూర్తిగా పక్కన పెట్టాలని కూడా ఆలోచిస్తున్నారు. అలాగే వైసీపీ యాంటీ కమ్మ స్టాండ్ తీసుకుటోందని ప్రచారం చేయడం ద్వారా మొత్తానికి మొత్తం వర్గాన్ని ఒక్కటి చేయాలన్న ఎత్తుగడ ఉంది. ఏది ఏమైనా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డాక మూడు దశాబ్దాల పాటు కమ్మలు ఎన్నో పురిటినొప్పులు పడితే టీడీపీ రూపంలో రాజకీయ వేదిక లభించింది. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కోల్పోకూడదు అన్న పట్టుదలతో వారు ఉన్నారు. ఎక్కడా తగ్గేది లేదు అన్నట్లుగా వారి దూకుడు ఉంది. మొత్తానికి ఏపీలో 2019లో కమ్మల మీద వ్యతిరేకత రగిల్చి వైసీపీ అధికారంలోకి వచ్చింది. టిట్ ఫర్ టాట్ అన్నట్లుగా రివర్స్ గేర్ లో వైసీపీని దించేందుకు బలమైన సామాజికవర్గం టీడీపీ ని ముందు పెట్టి ఆడే రాజకీయ ఆట వచ్చే ఎన్నికలలో సంచలనమే రేపనుంది.