Begin typing your search above and press return to search.

ఆంధ్రోళ్లకు మిగిలింది వెంకన్నేనా?

By:  Tupaki Desk   |   23 Aug 2015 7:10 AM GMT
ఆంధ్రోళ్లకు మిగిలింది వెంకన్నేనా?
X
రాష్ట్ర విభజన సందర్భంగా నాటి కేంద్రం అనుసరించిన విధానాలు.. ఆంధ్రా మీద చూసిన చిన్నచూపుతో జరిగిన నష్టం ఎంత భారీగా ఉంటుందన్న విషయం తెలిసినా.. తీవ్రత మాత్రం విభజన తర్వాతే తెలుస్తోంది. ముందుగా ఊహించినట్లే చాలా సమస్యలు ఎదురవుతున్నా.. ఏపీకి జరిగిన నష్టంతో ఏపీ సర్కారు ఎంత ఇబ్బంది పడుతుందన్న విషయం పాలకుల మాటల్లో స్పష్టమయ్యే పరిస్థితి.

ఉమ్మడి రాష్ట్రంలో అభివృద్ధి మొత్తాన్ని పోగేసినట్లుగా హైదరాబాద్ కు పరిమితం చేయటంతో.. ఏం కావాలన్నా హైదరాబాద్ లో తప్పించి మరోప్రాంతంలో లేదన్నట్లుగా పరిస్థితి తయారైంది. దీంతో.. విభజన తర్వాత.. ఏపీ పాలకులకు ఏం చేయాలోపాలుపోని పరిస్థితి. ఒకప్పుడు అన్ని ఉన్నట్లుగా అనిపించిన స్థానే ఇప్పుడే ఏమీ లేవన్న విషయాన్ని ఒప్పుకోక తప్పని దుస్థితి. దీనికి కారణం హైదరాబాద్ లేకపోవటమే.

దేశంలోనే అత్యంత కీలకమైన నగరాల్లో ఒకటైన హైదరాబాద్ ఏపీలో లేకపోవటంతో.. చాలా విషయాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా ఏపీ రాష్ట్ర మంత్రి కామినేని శ్రీనివాస్ మాటలే దీనికి నిదర్శనం. తాజాగా ఆయనో కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏపీ ఎంత నష్టపోయిందన్న విషయాన్ని ప్రస్తావిస్తూ.. కార్పొరేట్ ఆసుపత్రులు.. పరిశోధనా సంస్థలన్నీ తెలంగాణలోనే ఉన్నాయని.. ఏపీకి మిగిలింది తిరుపతి వెంకన్న మాత్రమేనని ఆవేదన వ్యక్తం చేశారు. విభజన నేపథ్యంలో ఏపీకి జరిగిన అన్యాయం కారణంగా ఒకమోస్తరు ఆసుపత్రులు.. పరిశోధన సంస్థలు ఏర్పడి.. అవి పని చేయాలంటూ కొంతకాలం పట్టక తప్పదు. అయితే.. ఇందుకు ప్రభుత్వం కంటే.. ప్రైవేటు రంగం కలిసి రావాలని కోరుతున్నారు. ఏమీ లేని చోట ఎవరు మాత్రం ముందుకొచ్చి పెట్టుబడులు పెడతారు..?