Begin typing your search above and press return to search.

ఏపీకి మోడీ సర్కారు చాలా చేసిందంట

By:  Tupaki Desk   |   7 Sep 2015 11:46 AM GMT
ఏపీకి మోడీ సర్కారు చాలా చేసిందంట
X
ఏపీకి ఎంతో చేస్తానని ఎన్నికల ముందు చెప్పిన మోడీ.. ఎన్నికల తర్వాత ఏం చేసింది అందరికి తెలిసిందే. విభజన కారణంగా దెబ్బతిన్న ఏపీని తాను ఆదుకుంటానని.. అన్నివిధాలుగా సాయం చేస్తానని ప్రకటించిన మోడీ.. అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్న వైనంపై సర్వత్ర విమర్శలు వ్యక్తమవుతోంది.

వీటన్నింటికి తోడు ఏపీకి ఇవ్వాల్సిన ప్రత్యేక హోదా విషయంలో సంబంధం లేని మాటలు ఎన్నో చెప్పేసి.. ఇచ్చేస్తామని ఒకసారి.. ఇవ్వనని మరోసారి చెబుతూ.. కన్ఫ్యూజ్ చేసేస్తున్న మోడీ సర్కారు.. ఏపీకి ఏమీ చేయదన్న విషయాన్ని ఇప్పటికే తన చేతల ద్వారా స్పష్టం చేసిన విషయం తెలిసిందే. అయితే.. ఇందుకు భిన్నంగా ఏపీకి మోడీ సర్కారు ఎంతో చేసేసిందని.. అసలు దేశంలో మరే రాష్ట్రానికి చేయలేనంతగా మాట్లాడేయటం ఏపీ ఎంపీ హరిబాబుకే చెల్లింది.

తనకు ఓట్లేసి గెలిపించిన ప్రజల ప్రయోజనాల కంటే కూడా పార్టీనే గొప్పగా భావించే హరిబాబు లాంటి నేతలే ఏపీకి ప్రధమ శత్రువులుగా చెప్పాలి. ఏపీకి మోడీ సర్కారు చేసిన సాయం గురించి గొప్పలు చెప్పుకునే హరిబాబు.. పది కాలాల పాటు గుర్తుంచుకోవాల్సిన విషయాన్ని చెప్పుకొచ్చారు.

స్వాతంత్ర్యం తర్వాత ఆంధ్రప్రదేశ్ కు చేయనంత సాయం మోడీ సర్కారు చేసిందని చెప్పుకొచ్చారు. నిజంగా అంతసాయమే చేసి ఉంటే.. ఏపీకి నిధుల వరద పారాలిగా. మరి.. అలాంటిదేమీ ఎందుకు కనిపించటం లేదో..? ఇక ప్రత్యేక హోదా మంచిదా? ప్రత్యేక ప్యాకేజీ మంచిదా? అన్న అంశాన్ని ఆలోచిస్తూ.. సరైన నిర్ణయం తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు చెప్పారు.