Begin typing your search above and press return to search.

కమలా పర్పుల్ కలర్ డ్రెస్ వెనుక అంత హిస్టరీ ఉందట

By:  Tupaki Desk   |   21 Jan 2021 4:30 AM GMT
కమలా పర్పుల్ కలర్ డ్రెస్ వెనుక అంత హిస్టరీ ఉందట
X
అమెరికా దేశ చరిత్రలో ఒక మహిళ ఉపాధ్యక్ష పదవిని చేప్టటం తొలిసారి. అదే సమయంలో అమెరికాయేత మూలాలు ఉన్న వ్యక్తి కూడా కావటం మరో విశేషంగా చెప్పాలి. సుప్రీంకోర్టు జస్టిస్ సోనియా సొటోమేయర్ ఆమె చేత ప్రమాణస్వీకారం చేయించారు. కమలా హారిస్ ప్రమాణస్వీకారం చేసిన కొద్ది నిమిషాల తర్వాత 46వ అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ బాధ్యతలు చేపట్టారు.

ప్రమాణస్వీకారానికి ఆమె చీరకట్టులో కనిపిస్తారన్న అంచనాలు వినిపించాయి. అయితే.. అందుకు భిన్నంగా ఆమె పర్పుల్ కలర్ డ్రెస్ లో హాజరయ్యారు. అయితే.. ఆమె ధరించిన డ్రెస్ వెనుక పెద్ద కథే ఉందంటున్నారు. గతంలో అమెరికా అధ్యక్ష పదవి కోసం జో బైడెన్ కు పోటీగా ఆమె రంగంలోకి దిగటం.. ఆ సందర్భంగా మద్దతు సంపాదించేందుకు చేసిన ప్రచారం సందర్భంగా ఆమె పర్పుల్ కలర్ దుస్తుల్నే ధరించే వారు. ఇప్పుడా విషయాన్ని గుర్తు చేసేలా ఆమె డ్రెస్సింగ్ ఉందంటున్నారు.

అంతేకాదు.. పర్పుల్ కలర్ డ్రెస్ ను కమలా ఎంపిక చేసుకోవటానికి చారిత్రక అంశాలు ఉన్నాయని చెబుతున్నారు. కొన్ని దశాబ్దాల క్రితం షిర్లే క్రిషోల్మ్ అనే నల్లజాతి మహిళ అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేశారు. ఆమె తన రాజకీయ జీవితానికి స్ఫూర్తిగా కమలా చెబుతుంటారు. ఆమెకు గుర్తుగా తాజాగా పర్పుల్ కలర్ డ్రెస్ ధరించారంటున్నారు. బైడెన్.. కమలా హారిస్ ప్రమాణస్వీకారానికి మాజీ అధ్యక్షులు బరాక్ ఒబామా.. బిల్ క్లింటన్.. జార్జ్ బుష్.. మాజీ ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ తో సహా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు హాజరయ్యారు. తాను చేసే ప్రతి పనిలోనూ ఏదో ఒక విశేషం దాగి ఉంటుందన్న విషయాన్ని కమలా చెప్పకనే చెప్పేశారని చెప్పాలి.