Begin typing your search above and press return to search.

కమలా హారిస్ విజయం సాధించింది .. తమిళనాడు లో వైరల్ గా పోస్టర్లు, బ్యానర్లు , అసలు ఏమిటంటే ?

By:  Tupaki Desk   |   18 Aug 2020 11:50 AM GMT
కమలా హారిస్ విజయం సాధించింది .. తమిళనాడు లో వైరల్ గా పోస్టర్లు, బ్యానర్లు , అసలు ఏమిటంటే ?
X
ఈ ఏడాది చివర్లో అమెరికా లో ఎన్నికలు జరగబోతున్నాయి. దీనితో అమెరికా లో ఎన్నికల కోలాహాలం మొదలైంది. అదేమీ విచిత్రం కాదు కానీ , అమెరికాలో ఎన్నికలు జరగబోతుంటే ..తమిళనాడులో భారీగా పోస్టర్లు , బ్యానర్లు దర్శనం ఇస్తున్నాయి. అదేంటి ..అమెరికా ఎన్నికలు తమిళనాడు లో పెట్టబోతున్నారా అని అనుకోకండి. దాని వెనుక మరో కారణం ఉంది. అదేమిటి అంటే ..ఈసారి జరిగే ఎన్నికల్లో అమెరికా ఉపాధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న కమలా హరీష్ భారత సంతతి చెందిన మహిళా. ఆమె కుటుంబ మూలాలు చెన్నై లో ఉన్నాయి. దీనితో కమలా హారిస్ కు తమిళనాడుకు రక్తసంబంధం ఉందని తమిళ ప్రజలు సైతం ఆనంద పడుతున్నారు. హోవర్డ్ వర్శిటీ నుంచి రాజకీయ, ఆర్థిక శాస్త్రంలో డిగ్రీ చేసిన కమలా హారిస్ 2010, 2014లో రెండు సార్లు కాలిఫోర్నియా అటార్నీ జనరల్ గా పని చేశారు. ఆ సమయంలో కాలిఫోర్నియాలో కమలా హారిస్ కు ప్రత్యేక గుర్తింపు వచ్చింది.

తమిళనాడుకు చెందిన ప్రభుత్వ అధికారి పీవీ గోపాలన్ భార్య శ్యామలా చెన్నైలోనే జన్మించారు. కమలా హారిస్ తల్లి శ్యామలా. పీవీ గోపాలన్ భార్య శ్యామలా చెన్నైలోనే జన్మించారు. కమలా హారిస్ తండ్రి డొనాల్డ్ హారిస్ నల్లజాతీయుడు. కమలా హారిస్ పుట్టిన 7 ఏళ్లకే ఆమె తల్లిదండ్రులు డొనాల్డ్ హారిస్, శ్యామలా విడాకులు తీసుకున్నారు. కమలా హారిస్ అమెరికా ఉపాధ్యక్ష పదవికి పోటీ చేస్తున్ననట్లు వెలుగు చూసినప్పటి నుంచి తమిళనాడులో ఆమెతో పాటు ఆమె కుటుంబ సభ్యులు హాట్ టాపిక్ అయ్యారు. ఇదే సమయంలో అమెరికా ఉపాధ్యక్ష ఎన్నికల్లో మన పీవీ గోపాలన్ గారి మనుమరాలు విజయం సాధించినట్లే, అందులో ఎలాంటి సందేహం లేదు అంటూ చెన్నై సిటీతో పాటు తమిళనాడులోని ప్రముఖ నగరాలు, పట్టణాల్లో తమిళ ప్రజలు భారీ సంఖ్యలో పీవీ గోపాలన్, కమలా హారిస్ చిన్ననాటి పోస్టర్లతో ఏర్పాటు చేసిన ఫోటోలతో పోస్టర్లు, బ్యానర్లు ఏర్పాటు చేశారు.

కమలా హారిస్ మేనకోడలు మీనా హారిస్ కాలిఫోర్నియాలో ప్రముఖ న్యాయవాది. తమిళనాడులో పీవీ గోపాలన్ మనుమరాలు కమలా హారిస్ విజయం సాధించినట్టే అంటూ తమిళంలో తమిళనాడులోని తిరువూర్ లోని ఆలయం మీద రాసిన చేతిరాతలు, పోస్టర్లను ఆమె ట్విటర్ లో పోస్టు చేసి సంతోషం వ్యక్తం చేశారు. తమ కుటుంబం పై ప్రజలు చూపిస్తున్న ప్రేమకి ఆమె చాలా సొంతోషించారు. తాను చిన్నతనంలో కుటుంబ సభ్యులతో కలిసి చెన్నై వెళ్లేవాళ్లమని, మా ముత్తాత పీవీ గోపాలన్ గురించి మేము తెలుసుకునే వాళ్లమని, మా బామ్మ (పీవీ గోపాలన్ భార్య) ఆయనకు కొండంత అండగా ఉండేవారని మీనా హారిస్ గుర్తు చేసుకుంటున్నారు. మొత్తం మీద అమెరికా ఉపాధ్యక్ ఎన్నికల్లో కమలా హారిస్ పోటీ చేస్తున్నారని తెలిసిన తరువాత తమిళనాడులో పండుగ వాతావరణం నెలకొంది.