Begin typing your search above and press return to search.

కమలా పంటపండింది..అమెరికా ఉపాధ్యక్ష పదవి ఇక లాంఛనమే!

By:  Tupaki Desk   |   7 Nov 2020 11:50 AM GMT
కమలా పంటపండింది..అమెరికా ఉపాధ్యక్ష పదవి ఇక లాంఛనమే!
X
ప్రస్తుతం వస్తున్న ఎన్నికల ఫలితాల సరళిని గమనిస్తుంటే డెమోక్రాట్ల అభ్యర్థి జోబైడెన్​ గెలుపు ఖాయంగా కనిపిస్తున్నది. మరికొన్ని గంటల్లోనే అతడిని అమెరికా అధ్యక్షుడిగా ప్రకటించనున్నారు. ఇప్పుడు కౌంటింగ్​ జరుగుతున్న అన్ని రాష్ట్రాలన్నీ బైడెన్​ దూసుకుపోతున్నారు. గెలుపుకు అతి చేరువలో ఉన్నారు. ఇదిలా ఉంటే మరోవైపు డెమోక్రటిక్ పార్టీ తరపున భారత సంతతికి చెందిన కమలా హ్యారిస్ ఉపాధ్యక్ష పదవికి పోటీచేస్తున్న విషయం తెలిసిందే. బైడెన్ గనక అధ్యక్షుడిగా ఎన్నికైతే చాలు కమలా హ్యారిస్​ అమెరికా ఉపాధ్యక్షురాలిగా ప్రమాణం చేస్తారు. ఏది ఏమైనా ఓ భారత సంతతికి చెందిన మహిళ అమెరికా ఉపాధ్యక్షురాలిగా గెలుపొందడం భారతీయులకు గర్వకారణం. ఆమె గెలుపు కోసం తమిళనాడు వ్యాప్తంగా పూజలు జరిగాయి. ప్రస్తుతం వాళ్ల పూజలు ఫలించినట్టే కనిపిస్తున్నది.

మొదటి భారతీయ అమెరికన్, మొదటి నల్లజాతి, మొదటి దక్షిణాసియా అమెరికన్ ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన మొదటి ఏషియన్‌గా ఆమె అవతరించనున్నారు. కమలా తల్లి ఇండియన్.. తండ్రి ఆఫ్రికన్ (జమైకా) కావడంతో.. రెండు దేశాల సంప్రదాయాలు కమలా హ్యారిస్‌లో కనిపిస్తున్నాయి. కాలిఫోర్నియాలో ఇండో ఆఫ్రికన్ అమెరికన్‌ గా పుట్టిన కమలా హ్యారిస్.. డెమోక్రటిక్ పార్టీ లో కీలక స్థాయికి ఎదిగారు. కాలిఫోర్నియా నుంచి 2016లో యూఎస్ సెనేట్‌ కు ఎన్నికైన కమల ఇప్పుడు ఉపాధ్యక్షురాలి గా ఉన్నారు. తల్లి శ్యామలా గోపాలన్‌ తో కలిసి హ్యారిస్ చాలా సార్లు చెన్నై కి వచ్చారు. మొత్తానికి ఓ భారత సంతతి మహిళ అగ్ర రాజ్యానికి ఉపాధ్యక్షురాలి గా ఎన్నిక కాబోతున్నది.