Begin typing your search above and press return to search.
దుర్గాదేవి గా కమలా హ్యారిస్ .. మహిషాసురుడి ట్రంప్ .. ముదురుతున్న వివాదం !
By: Tupaki Desk | 21 Oct 2020 2:20 PM ISTఅమెరికా అధ్యక్ష ఎన్నికలు యావత్ ప్రపంచాన్ని ఆకర్షిస్తున్నాయి. ప్రపంచ దేశాల అగ్రరాజ్యంగా అమెరికా ఉండటంతో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎవరు గెలిచి అధ్యక్ష పీఠం పై కూర్చుంటారో అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. నవంబర్ 3 న అధ్యక్ష ఎన్నికలకి పోలింగ్ జరగనుంది. ఇక ప్రస్తుతం ప్రచారంలో బిజీ బిజీగా గడుపుతున్నారు. ఎన్నికల ప్రచారంలో ఓటర్లను ఆకట్టుకోవడానికి మన దేశంలో రకరకాల చిత్రవిచిత్ర వేషధారణలతో అభ్యర్థులు కనిపిస్తూ , ఓట్లు వేయాలని కోరుతుంటారు. అప్పుడప్పుడు దేవుళ్లలా కూడా కనిపిస్తుంటారు. ఇదే సంప్రదాయం ఇప్పుడు అమెరికాలో కూడా కొనసాగుతుంది.
డెమోక్రాటిక్ పార్టీ తరుపున ఉపాధ్యక్షురాలిగా పోటీ చేస్తున్న భారత సంతతి మహిళ కమలా హ్యారిస్ దుర్గా దేవి రూపంలో ఉన్న ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే దీనిపై హిందూ వర్గాల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కమలా హ్యారిస్ మేనకోడలు,న్యాయవాది,ఫినామినల్ విమెన్ యాక్షన్ క్యాంపెయిన్ వ్యవస్థపాకురాలు మీనా హ్యారిస్ ఆ ఫోటోను తన ట్విట్టర్ ఖాతా లో షేర్ చేశారు. అందులో దుర్గా దేవి రూపంలో ఉన్న కమలా హ్యారిస్... రాక్షసుడైన మహిషాసురుడి రూపంలో ఉన్న డొనాల్డ్ ట్రంప్ ను శూలంతో పొడిచి చంపుతున్నట్లు కనిపిస్తోంది. అయితే ఈ ఫోటోపై హిందూ అమెరికన్ ఫౌండేషన్ తీవ్రంగా స్పందించింది. 'హిందూ దేవతామూర్తి ఫోటో ను ఇతరుల ముఖ చిత్రాలతో క్యారికేచర్ లా మలచడం ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది హిందువుల మనోభావాలను దెబ్బతీసింది. కాబట్టి మీనా హ్యారిస్ హిందువులకు క్షమాపణలు చెప్పాలి అని ఆ సంస్థ డిమాండ్ చేసింది. దీనితో ఆ వివాదం రోజు రోజు కి పెద్దదిగా మారడం తో ఆ ఫోటోను ఆమె తన ఖాతా నుండి తొలగించింది.
ఈ వివాదం పై హిందూ అమెరికన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ సభ్యుడు రిషి భుటాడా ఈ వివాదంపై స్పందిస్తూ... నిజానికి ఆ ఫోటో మీనా హ్యారిస్ సృష్టించింది కాదన్నారు. వాట్సాప్ లో విస్తృతం గా సర్క్యులేట్ అవుతున్న ఫోటోనే ఆమె తన ట్విట్టర్ ఖాతా లో పోస్ట్ చేసిందన్నారు. అయినప్పటికీ మీనా హ్యారిస్ క్షమాపణలు చెబుతారని భావిస్తున్నానన్నారు. అమెరికన్ పాలిటిక్స్ కోసం మన ఆదర్శ దేవతా మూర్తుల ఫోటోలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపయోగించుకోవద్దన్నారు. అమెరికన్ హిందూ కన్వీనర్ అజయ్ షా మాట్లాడుతూ... ఆ ఫోటో హిందువుల్లో తీవ్ర ఆగ్రహావేశాలను రగిల్చిందన్నారు.తాను షేర్ చేసిన ఫోటో పై తీవ్ర విమర్శల నేపథ్యం లో మీనా హ్యారిస్ స్పందించారు. నిజం చెప్పాలంటే ఇప్పుడు తానేమీ మాట్లాడలేని స్థితి లో ఉన్నానన్నారు. అయితే మీనా హ్యారిస్ క్షమాపణ మాత్రం చెప్పలేదు. దీనితో ఇప్పట్లో ఈ వివాదం ముగిసేలా లేదు. ఇక విజయదశమి సందర్భం గా కమలా హ్యారిస్,జో బైడైన్ హిందువులకు శుభాకాంక్షలు తెలిపారు. చెడు పై మంచి నెగ్గాలని , అలాగే అమెరికా ఎన్నికల్లోనూ చెడు పై మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నట్టు తెలిపారు.