Begin typing your search above and press return to search.
థర్డ్ ఫ్రంట్ దిశగా కమల్.. శరత్ కుమార్ తో భేటి.. పొత్తులకు ఎత్తు
By: Tupaki Desk | 27 Feb 2021 5:30 PMతమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగడంతో రాజకీయ పార్టీలు పొత్తుల ఎత్తులు వేస్తున్నాయి. సీట్ల పంపకాలు.. పొత్తుల విషయాల్లో తలమునకలయ్యాయి. సాధారణంగా ప్రతి అసెంబ్లీ ఎన్నికల్లోనూ రాష్ట్రంలో అన్నాడీఎంకే-డీఎంకే మధ్యే ప్రధాన పోరు నెలకొంటోంది. దివంగత దిగ్గజ నేతలు కరుణానిధి, జయలలిత లేకుండా జరుగుతున్న తొలి అసెంబ్లీ ఎన్నికలు ఇవే కావడం గమనార్హం.ఈసారి అన్నాడీఎంకే-బీజేపీ, డీఎంకే-కాంగ్రెస్ పొత్తుతో బరిలో దిగనున్నాయి. ఈ మేరకు సీట్ల పంపకాలపై ఇప్పటికే చర్చలు మొదలుపెట్టాయి. మరోవైపు మక్కల్ నీదిమయ్యమ్ అధినేత, నటుడు కమల్ హాసన్ థర్డ్ పార్టీపై ఫోకస్ చేశారు.
తాజాగా నటుడు, కట్చీ పార్టీ అధినేత శరత్ కుమార్ తాజాగా కమల్ హాసన్ ను కలిశారు. థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుపై చర్చించారు. పార్టీలు కలిసి పోటీచేస్తే బాగుంటుందని కమల్ హాసన్ తో మాట్లాడారు. పవన్ నుంచి సానుకూల స్పందన వస్తుందని ఆశిస్తున్నారు. మంచి పనికోసం రాజీపడేందుకు తాను సిద్ధమని ప్రకటించాడు.తమతో కలిసి నడిచేందుకు సిద్ధంగా ఉన్న పార్టీలకు తలుపులు తెరిచే ఉంచినట్లు కమల్ హాసన్ ప్రకటించారు. మార్చి 3న తాను ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తానని.. మార్చి 7న తొలివిడత జాబితా వెల్లడిస్తానని కమల్ హాసన్ తెలిపారు.