Begin typing your search above and press return to search.
వైరల్ గా మాజీ ముఖ్యమంత్రి వీడియో.. మహిళను బీజేపీ నేతలు ఎంతలా కొట్టారంటే?
By: Tupaki Desk | 22 Aug 2020 9:50 AM GMTమధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమ్ కాంగ్రెస్ సీనియర్ నేత కమల్ నాథ్ పోస్టు చేసిన వీడియో ఒకటి సంచలనంగా మారింది. నడిరోడ్డు మీద ఒక దళిత మహిళపై బీజేపీ నేతలు భౌతిక దాడి చేయటం సంచలనంగా మారింది. ఆమె కుమార్తె అక్కడే ఉండి.. ఎంతగా ప్రాధేయపడ్డా.. అక్కడి వారు ఊరుకోకుండా కొడుతున్న వైనానికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
బీజేపీ హయాంలో రాష్ట్రంలో మహిళలకు భద్రత లేకుండా పోయిందని.. వారు తరచూ దాడులకు గురవుతున్నారంటూ ఆరోపిస్తూ.. మండిపడ్డారు. మాజీ సీఎం పోస్టు చేసిన వీడియోలో.. ఒక వ్యక్తి ఒక మహిళను నెట్టేస్తూ.. ఆమెపై దాడి చేస్తూ కనిపించారు. ఈ క్రమంలో సదరు వ్యక్తి పంచె ఊడిపోయినా.. దాన్ని పైకి కట్టుకొని మరీ మహిళను కింద పడేసి మరీ కొట్టే ప్రయత్నం చేస్తున్నారు.
ఈ సందర్భంగా బాధితురాలు గట్టిగా కేసులు వేయసాగింది. తన తల్లిని కొట్టొద్దంటూ ఆమె కుమార్తె దీనంగా ప్రాథేయపడ్డా.. బీజేపీ నేతలు పట్టించుకోలేదు. ఇంతకూ ఇదంతా ఎందుకు జరిగిందంటే.. బీజేపీ నేతల తీరుపై నిరసన వ్యక్తం చేసినందుకు ఈ తీరులో దాడి చేసినట్లుగా పేర్కొన్నారు.
బేతుల్ జిల్లాలోని శోభాపూర్ లో బీజేపీ నేతలపై నిరసన చేసినందుకు ఒక దళిత మహిళపైనా.. ఆమె కుమార్తె మీదా కమలనాథులు దాడి చేశారు. ఆ బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసినా వారిపై చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు. దాడికి పాల్పడిన బీజేపీ నేతలకు అక్కడి పోలీసులు వత్తాసు పలికినట్లుగా పేర్కొన్నారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ ను ఉద్దేశించి కమల్ నాథ్ తాను పోస్టు చేసిన వీడియోలో.. ‘‘శివరాజ్ జీ.. మీ ప్రభుత్వంలో మహిళపై తరచూ ఇలాంటి సంఘటనలు ఎదురవుతున్నాయి. పోలీసులు సైతం నిందితులకు రక్షణ కల్పిస్తున్నారు. తక్షణమే వారిపై చర్యలు తీసుకోవాలి.. సదరు మహిళకు.. ఆమె కుమార్తెకు న్యాయం చేయాలి’’ అని పేర్కొన్నారు. ఈ వీడియో వైరల్ గా మారింది. మరి.. బీజేపీ నేతలపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ తీరులో చర్యలు తీసుకుంటారో చూడాలి.