Begin typing your search above and press return to search.

సొంత పార్టీ నేత‌కు కాంగ్రెస్ సీఎం వార్నింగ్ లాంటిది!

By:  Tupaki Desk   |   16 Feb 2020 1:36 PM GMT
సొంత పార్టీ నేత‌కు కాంగ్రెస్ సీఎం వార్నింగ్ లాంటిది!
X
దేశంలో కొద్దో గొప్పో రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి అక్క‌డి అంత‌ర్గ‌త గొడ‌వ‌లు ఇబ్బందిగా మారుతున్న‌ట్టున్నాయి. అలాంటి వాటిల్లో ఒక‌టి మ‌ధ్య‌ప్ర‌దేశ్ వ్య‌వ‌హారం. అక్క‌డ ముఖ్య‌మంత్రి క‌మ‌ల్ నాథ్ కు, పార్టీ నేత సింధియాకు అస్స‌లు ప‌డ‌టం లేదు. వీరిద్ద‌రూ విబేధాల‌తో ఇప్పుడు మ‌ళ్లీ వార్త‌ల్లోకి వ‌స్తున్నారు. మ‌ధ్య‌ప్ర‌దేశ్ లో కాంగ్రెస్ బోటాబోటీ మెజారిటీతో విజ‌యం సాధించిన‌ప్పుడే సీఎం పీఠాన్ని ఆశించాడు సింధియా. అయితే యువ‌కుడు అయిన సింధియాకు సీఎం పెద్ద ప‌ద‌వి అన్న‌ట్టుగా సోనియా గాంధీ అవ‌కాశం ఇవ్వ‌లేదంటారు. సీనియ‌ర్ అయిన క‌మ‌ల్ నాథ్ కే ఆమె అవ‌కాశం ఇచ్చార‌ప్పుడు.

అప్ప‌ట్లోనే సింధియా అస‌హ‌నం వ్య‌క్తం చేశాడు. కానీ లోక్ స‌భ ఎన్నిక‌ల్లో మ‌ధ్య‌ప్ర‌దేశ్ లో కాంగ్రెస్ బోల్తా ప‌డ‌టం, సింధియా కూడా స్వ‌యంగా ఓడిపోవ‌డంతో.. ఆయ‌నకు మ‌రింత ప్రాధాన్య‌త త‌గ్గిపోయింది. ఇలాంటి క్ర‌మంలో కూడా క‌మ‌ల్ నాథ్ ను ఇబ్బంది పెట్టే వ్యాఖ్య‌లు చేస్తున్నారు సింధియా. ఎన్నిక‌ల హామీల అమ‌లు విష‌యంలో సింధియా వ్యాఖ్యానాలు క‌మ‌ల్ నాథ్ కు కోపాన్ని తెప్పించారు.

కాంగ్రెస్ పార్టీ ఎన్నిక‌ల హామీల‌ను అమ‌లు చేయాల‌ని, లేక‌పోతే త‌ను రోడ్డెక్కుతానంటూ ఇటీవ‌లే సింధియా ప్ర‌క‌టించాడు. కౌంట‌రిచ్చాడు క‌మ‌ల్ నాథ్. త‌మ‌కు ప్ర‌జ‌లు అధికారాన్ని ఇచ్చింది ఐదేళ్ల‌కు అని, ఐదు నెల‌ల‌కు కాదంటూ క‌మ‌ల్ నాథ్ వ్యాఖ్యానించారు. ఐదేళ్ల‌లో తాము అన్ని హామీల‌నూ అమ‌లు చేస్తామంటూ.. ఐదు నెల‌ల‌కే అన్నీ అమ‌లు చేయ‌డం సాధ్యం కాద‌న్న‌ట్టుగా ఆయ‌న వ్యాఖ్యానించారు. హామీలు అమ‌లు కాక‌పోతే రోడ్డెక్కుతానంటూ సింధియా చేసిన వ్యాఖ్య‌ల‌పై క‌మ‌ల్ నాథ్ ఘాటుగా స్పందించారు. 'చేయ‌నివ్వండి చూద్దాం..' అంటూ హెచ్చిర‌క‌లాంటిదాన్ని జారీ చేశారు క‌మ‌ల్ నాథ్. మ‌రి దీనిపై సింధియా ఎలా స్పందిస్తాడో!