Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ ప్రక్షాళన.. సీనియర్ కు కీలక బాధ్యతలు

By:  Tupaki Desk   |   15 July 2021 11:30 AM GMT
కాంగ్రెస్ ప్రక్షాళన.. సీనియర్ కు కీలక బాధ్యతలు
X
దేశంలోని ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ వ్యూహం మార్చింది. పార్టీలో కీలకమైన మార్పులు తీసుకొచ్చింది. కాంగ్రెస్ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించబోతున్నారు. ఈ మేరకు ఢిల్లీలో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి.

మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్ నాథ్ తాజాగా అధ్యక్షురాలు సోనియాగాంధీతో భేటి అయ్యారు. దాదాపు గంట పాటు వీరిద్దరి భేటి రాజకీయవర్గాల్లో ఆసక్తి రేపుతోంది. ఈ సమావేశంలో పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కూడా పాల్గొన్నారు.

రానున్న పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంతోపాటు మరికొన్ని కీలకమైన అంశాలను కూడా ఈ సమావేశంలో చర్చించారు.

కమల్ నాథ్ ను కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా చేసి.. సోనియా గాంధీ దేశ రాజకీయాల్లో చక్రం తిప్పుతారని అంటున్నారు. ఈ నేపథ్యంలో వీరిద్దరి భేటికి అత్యంత ప్రాధాన్యం ఏర్పడింది. కొన్ని రోజుల క్రితమే పార్టీలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

జాతీయ స్తాయిలో ప్రతిపక్షాలన్నింటినీ కాంగ్రెసే సమన్వయ పరచాలని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సూచించడంతో ఇందుకు మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్ నాథ్ సమర్థుడని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. అన్ని పార్టీలతో కమల్నాథ్ కు సత్సంబంధాలు ఉండడమే దీనికి కారణం.

బీజేపీయేతర పార్టీలను కూడగట్టగలరన్న నమ్మకంతో ఆయన్ను పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమించే అవకాశాలున్నాయని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.

బుధవారం జరిగిన కాంగ్రెస్ పార్లమెంటరీ వ్యూహబృందం సమావేశంలోనూ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్గా కమల్ నాథ్ ను నియమిస్తారని.. సోనియాగాంధీని పూర్తి స్థాయి అధ్యక్షురాలిగా వ్యవహరిస్తారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.