Begin typing your search above and press return to search.

థర్డ్ ఫ్రంట్ కు కలిసి రండి: కమల్ పిలుపు

By:  Tupaki Desk   |   24 Dec 2020 7:51 AM GMT
థర్డ్ ఫ్రంట్ కు కలిసి రండి: కమల్ పిలుపు
X
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఐదారు నెలల సమయం మాత్రమే ఉండడంతో ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్ జోరు పెంచారు. రాజకీయంగా యాక్టివ్ అయ్యారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి కట్టి ఈసారి డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలను ఓడించాలని ప్రయత్నాలు చేస్తున్నారు.

వచ్చే సంవత్సరం జరగబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో సూపర్ స్టార్ రజినీకాంత్ మద్దతు కోరుతానని కమల్ హాసన్ ఇదివరకే ప్రకటన చేశారు. రానున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓట్ల కోసం అందరి ఇళ్లకు వెళ్లాలని అనుకుంటున్నట్టు కమల్ తెలిపాడు. తన మిత్రుడు రజినీకాంత్ ఇంటిని వదిలేస్తానా? అని కమల్ వ్యాఖ్యానించారు. రజినీ పార్టీతోనూ కమల్ పొత్తు పెట్టుకోవడానికి రెడీ అవుతున్నాడు.

ఈ క్రమంలోనే కమల్ హాసన్ తాజాగా మరో సంచలన పిలుపునిచ్చాడు. అవినీతి రహిత, పారదర్శకమైన పాలన కోసం మూడో కూటమిని ఏర్పాటు చేయబోతున్నట్టు ప్రకటించాడు. భావసారూప్యత కలిగిన పార్టీలన్నీ కలిసి రావాలని కమల్ పిలుపునిచ్చాడు.

తమిళనాడు ఎన్నికల్లో యువత పోటీకి ప్రాధాన్యత కల్పిస్తామని.. తమ పార్టీలో యూత్ చేరాలని కమల్ కోరారు. ఈ రెండు పార్టీల హయాంలో రాష్ట్రం అవినీతిమయం తయారైందని అన్నాడీఎంకే, డీఎంకేలపై కమల్ హాసన్ విరుచుకుపడ్డారు. విల్లుపురంలో బుధవారం మీడియాతో మాట్లాడుతూ ఈ విమర్శలు చేశారు.