Begin typing your search above and press return to search.
మహమ్మారిపై నిజాలు దాస్తున్న ప్రభుత్వం: కమల్
By: Tupaki Desk | 21 Jun 2020 6:50 AM GMTమహమ్మారిపై నిజాలను తమిళనాడు ప్రభుత్వం దాస్తోందని నటుడు, మక్కల్ పార్టీ అధినేత కమల్ హాసన్ ఆరోపించారు. మహమ్మారికు సంబంధించిన వాస్తవాలను ప్రభుత్వం వెల్లడించలేదని మండిపడ్డారు. తాజాగా తమిళనాడులో పలు జిల్లాల్లో మళ్లీ లాక్ డౌన్ విధించడాన్ని కమల్ హాసన్ తప్పుపట్టారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం వల్లే కేసులు పెరిగి మళ్లీ ఇలాంటి దుస్థితి నెలకొందని కమల్ హాజన్ దుయ్యబట్టారు.
తమిళనాడు ప్రభుత్వం మహమ్మారి విషయంలో నిర్లక్ష్యం వహించిందని ఆది నుంచి టెస్టులు ఎక్కువ చేయలేదని.. అదే ఇప్పుడు మళ్లీ లాక్ డౌన్ కు కారణమైందని కమల్ హాసన్ విమర్శించారు. సుమారు మూడు నెలలు లాక్ డౌన్ తో జనాలు ఇబ్బందులు పడ్డారని.. ఇప్పుడు మళ్లీ లాక్ డౌన్ ఎందుకని కమల్ ప్రశ్నించాడు.
సకాలంలో తమిళ ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని.. అందుకే మళ్లీ మహమ్మారి వచ్చిందని ప్రభుత్వ తీరును కమల్ విమర్శించాడు. విదేశాల నుంచి వచ్చిన వారి ద్వారానే మహమ్మారి వచ్చిందని మండిపడ్డారు. ఆదిలోనే వారిని కంట్రోల్ చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. ఎయిర్ పోర్టుల్లో పరీక్షలు చేసి ఉంటే ఇలా వ్యాపించేది కాదని తమిళ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.