Begin typing your search above and press return to search.

పాలిటిక్స్‌కు విశ్వ‌న‌టుడు.. గుడ్‌బై.. ఎంతో దూరం లేదు!

By:  Tupaki Desk   |   8 May 2021 8:59 AM GMT
పాలిటిక్స్‌కు విశ్వ‌న‌టుడు.. గుడ్‌బై.. ఎంతో దూరం లేదు!
X
`నీతి మంత‌మైన‌, నిజాయితీతో కూడిన రాజ‌కీయాల‌ను ప్ర‌జ‌ల‌కు ప‌రిచ‌యం చేస్తాను. స‌మాజంలో మార్పు లు తీసుకువ‌స్తాను. చేప‌లు ఇవ్వ‌ను.. చేప‌లు ప‌ట్టే వ‌ల‌లే ఇస్తాను. ప్ర‌జ‌ల‌ను ఉచితాల‌తో సోమ‌రుల‌ను చేయను. ఎన్నిక‌ల్లో ఓట్ల కోసం అభ్య‌ర్థిస్తానే త‌ప్ప‌.. ఆర్థిక లావాదేవీలు మాత్రం చేయ‌ను!`` అని చాటి చెప్పిన‌.. విశ్వ‌న‌టుడు, మ‌క్క‌ల్ నీది మ‌య్యం(ఎంఎన్ ఎం) పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడు.. క‌మ‌ల్ హాస‌న్‌.. త‌ను అనుకున్న‌ది సాధించ‌డంలో అడుగులు ముందుకు వేయ‌లేక పోయారు.

వాస్త‌వానికి క‌మ‌ల్ అనుకున్న‌ది ఒక‌టి.. ఎన్నిక‌ల్లో జ‌రిగింది మ‌రొక‌టి కావ‌డంతో ఆయ‌న ఏకంగా రాజ‌కీయాల‌కే స్వ‌స్తి చె ప్పాల‌ని భావిస్తున్న‌ట్టు త‌మిళ‌నాట జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే.. ఎన్నిక‌ల‌కు ముందు .. త‌న ఓట‌మిని, త‌న పార్టీ ఓట‌మిని అంచ‌నా వేయ‌లేదా? అంటే.. లెక్క‌లు వేసుకున్నారు. అదేస‌మ‌యంలో త‌న గెలుపు సాధ్యాసాధ్యాల‌పై ఆయ‌న అంచ‌నాకు కూడా వ‌చ్చారు. ఈ క్ర‌మంలోనే తాను గెలిస్తే.. అసెంబ్లీలోకి వెళ్తాన‌ని, లేక‌పోతే.. షూటింగుల‌కు వెళ్తాన‌ని కూడా చాలా లైట్ తీసుకున్నారు.

కానీ, ఇంతలోనే.. ఆయ‌న ఏకంగా పార్టీ జెండా పీకేసే నిర్ణ‌యానికి రావ‌డం వెనుక చాలానే క‌థ న‌డిచింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. కొంద‌రు క‌మ‌ల్ పార్టీ నాయ‌కులు.. అటు అప్ప‌టి అధికార ప‌క్షం అన్నాడీఎం కేతోను, ఇటు ప్ర‌స్తుత అధికారపార్టీ డీఎంకేతోను చేతులు క‌లిపార‌నేది నిర్వివాదాంశం. అయితే.. దీనిని గ్ర‌హించేలోగానే ఎన్నిక‌ల్లో ఆశించిన ఫ‌లితం రాక‌పోగా.. ఘోర అవ‌మానం త‌ప్ప‌లేదు. ఇక‌, ఈ ప‌రిణామంతో.. తాము వ‌చ్చిన ప‌ని ముగిసింద‌ని భావించిన నాయ‌కులు వెంట‌నే క‌మ‌ల్‌కు బై చెప్పారు. ఈ వ‌రుస‌లో పార్టీ ఉపాధ్యక్షులు కూడా ఉండ‌డం గ‌మ‌నార్హం.

ఈ ప‌రిణామాల‌తో విసుగు చెందారో ఏమో.. పార్టీకి గుడ్‌బై చెబుతున్న‌వారిని `ద్రోహులు` అంటూ.. క‌మ‌ల్ కామెంట్లు చేయ‌డం ప్రారంభించారు. పైగా.. ఇప్పట్లో ఎన్నికలు లేవు. ప్ర‌స్తుత ప్ర‌బుత్వంపైనా సీఎం స్టాలిన్‌పైనా విమర్శలు చేయడానికైనా కనీసం సంవత్సరం పడుతుంది. ఇక ఎప్పటికి అధికారం దక్కుతుందో తెలియదు. ఈ నేప‌థ్యంలోనే కమల్ గుడ్‌బై చెప్పి.. మ‌ళ్లీ షూటింగుల దారి ప‌డ‌తార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఏం చేస్తారో చూడాలి. అయితే.. ఇక్క‌డ ఒక్క విష‌యం మాత్రం రాజ‌కీయ నేత‌ల మ‌ధ్య చ‌ర్చ‌కు వ‌స్తోంది. గ‌తంలో ఆయ‌న‌తో క‌లిసి న‌టించి, కొన్నేళ్ల‌పాటు స‌హ‌చ‌రిగా వ్య‌వ‌హ‌రించిన‌.. న‌టి గౌత‌మి ఒక కామెంట్ చేశారు.. ``ఆవేశం త‌గ్గితేనే.. క‌మ‌ల్ ఏంటో తెలుస్తుంది`` అన్న ఈ కామెంట్ ప్ర‌స్తుతం త‌మిళ‌నాట జోరుగా వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.