Begin typing your search above and press return to search.

కమల్ హాసన్ వార్నింగ్

By:  Tupaki Desk   |   31 Aug 2021 8:00 AM GMT
కమల్ హాసన్ వార్నింగ్
X
సీనియర్ నటుడు.. మక్కల్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్ పార్టీ శ్రేణులకు సీరియస్ గా వార్నింగ్ ఇచ్చాడు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలని సూచించాడు. ఇందుకోసం ప్రతి ఒక్కరూ తమ బాధ్యతను సక్రమంగా నెరవేర్చాలని సూచించాడు. అప్పుడే స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటగలం అని స్పష్టం చేశారు.

గెలుపు గుర్రాలను గుర్తించి ప్రోత్సహించాలని.. అలా పనిచేయలేని వారు గౌరవంగా తప్పుకోండి అని ఎంఎన్ఎం అధ్యక్షుడు.. నటుడు కమల్ హాసన్ తేల్చిచెప్పాడు. తాజాగా స్థానిక సంస్థల ఎన్నికల సమరం కోసం కమల్ హాసన్ కసరత్తు ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రేణులకు హెచ్చరికలు పంపారు. ‘పరాచకాలొద్దు.. పనిచేయండి..లేదా తప్పుకోండి’ అని పార్టీ జిల్లా కార్యదర్శులను ఆదేవించాడు.

లక్ష్యాల సాధనకు వారికి 70 రోజుల గడువు కూడా విధించారు. లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన చేదు అనుభవాలను చాలెంజ్ గా తీసుకున్న కమల్ హాసన్ త్వరలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తున్నారు. పార్టీ నిర్వహణపై అలసత్వం, అలక్ష్యం వద్దు.. సీరియస్ గా తీసుకోండని జిల్లా కార్యదర్శులకు హితవు పలికినట్లు సమాచారం. అంతేగాక పార్టీ బలోపేతానికి 70 రోజులు గడువు విధిస్తూ సర్య్కూలర్ జారీ చేసినట్లు తెలిసింది.

క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా కమల్ హాసన్ ముందుకెళుతున్నారు.ఖాళీగా ఉన్న స్థానాల్లో సరైన అర్థత కలిగిన కొత్తవారిని నియమించాలని.. పార్టీ శాఖలు ఏర్పడని గ్రామాలు, ఊర్లు లేవనే స్తితికి రావాలని సూచించారు. ఈ పనులన్నీ 70 రోజుల్లోగా పూర్తి చేయాలని..గ డువులోగా ఈ పనులన్నీ పూర్తి చేయని పక్షంలో ఎవరికి వారు బాధ్యతల నుంచి స్వచ్ఛందంగా తప్పుకోవాలని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ పార్టీని సమాయత్తం చేయడం ఎంతో అవసరమని కమల్ పట్టుదలను ప్రదర్శిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.