Begin typing your search above and press return to search.
ఉప ఎన్నికల బరిలో కమల్ పార్టీ?
By: Tupaki Desk | 8 Nov 2018 7:54 AM GMTతమిళనాట విశ్వనటుడు కమల్ - సూపర్ స్టార్ రజనీల పొలిటికల్ ఎంట్రీ పై చర్చోపచర్చలు జరుగుతోన్న సంగతి తెలిసిందే. గత రెండేళ్లుగా సినీ ఫక్కీలో జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో రజనీ - కమల్ లు తమ రాజకీయ అరంగేట్రంపై క్లారిటీ ఇచ్చారు. కమల్ `మక్కల్ నీది మయ్యమ్` పార్టీ పెట్టి సైలెంట్ అయ్యారు. రజనీకాంత్ జస్ట్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి కామ్ అయ్యారు. అయితే, త్వరలో తమిళనాట 20 అసెంబ్లీ స్థానాల్లో ఉప ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ఈ ఇద్దరు స్టార్ ల పాలిటిక్స్ మరోసారి చర్చకు వచ్చాయి. వీరిద్దరూ ఈ ఎన్నికల్లో పోటీ చేస్తారా...లేక ఇంకా వేచి చూస్తారా అన్న విషయం తమిళనాట హాట్ టాపిక్ అయింది. ఈ నేపథ్యంలో తాజాగా ఆ ఉప ఎన్నికలో తమ పార్టీ పోటీ చేసే అవకాశముందని కమల్ అభిప్రాయపడ్డారు. అయితే, కచ్చితంగా తాము పోటీ చేస్తామని చెప్పడం లేదని - అవసరమైతే ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమని అన్నారు.
తన 64వ జన్మదిన వేడుకలను పార్టీ శ్రేణులు - అభిమానుల మధ్య కమల్ నిరాడంబరంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగానే ఆయన మాట్లాడుతూ.. రాబోయే ఉప ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేసే అవకాశముందని అభిప్రాయపడ్డారు. అవినీత రహిత సమాజం - ఆరోగ్యకరమైన రాజకీయాలు రావాలన్న ఉద్దేశ్యంతోనే తాను రాజకీయ రంగ ప్రవేశం చేసినట్లు తెలిపారు. తమ పార్టీ వేగంగా ప్రజల్లోకి వెళ్లేందుకు అవసరమైన ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. మరోవైపు, రజనీకాంత్ తన పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చినా....పార్టీని ప్రకటించలేదు. దీంతో, బీజేపీకి రజనీ మద్దతివ్వబోతున్నారని....ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పొలిటికల్ ఎంట్రీ విషయంలో రజనీకన్నా..కమల్ సీరియస్ గా ఉన్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాపడుతున్నరాఉ.