Begin typing your search above and press return to search.

రాజకీయాలొద్దన్న చిరుకు కమల్ కౌంటర్

By:  Tupaki Desk   |   29 Sep 2019 6:30 AM GMT
రాజకీయాలొద్దన్న చిరుకు కమల్ కౌంటర్
X
‘సైరా’ ప్రమోషన్ లో భాగంగా ఓ తమిళ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మన మెగాస్టార్ చిరంజీవి తమిళ పాలిటిక్స్ పై కూడా స్పందించారు. రాజకీయాల్లోకి వచ్చి తాను ఎంత తప్పు చేశానో తెలిసిందని.. ఈ ప్రస్తుత రాజకీయాల్లో ధనం, కుల ప్రభావం బాగా ఉందని.. ఎంతటి స్టార్లు వచ్చినా తట్టుకోవడం కష్టమని చిరంజీవి వ్యాఖ్యానించారు. తనతోపాటు తన తమ్ముడు పవన్ కళ్యాణ్ కూడా ఫెయిల్ అయ్యాడని.. ఇదే నిదర్శనమన్నారు.

అంతేకాదు.. తన స్నేహితులు కమల్ హాసన్, రజినీకాంత్ లను కూడా రాజకీయాల్లోకి రావాలనే ఆలోచనను మార్చుకోవాలని సూచించినట్టు చిరంజీవి మీడియాతో మాట్లాడుతూ చెప్పుకొచ్చాడు. తమను చూసి అయినా రాజకీయాల్లోకి రావద్దని సలహా ఇచ్చినట్టు చిరంజీవి పేర్కొన్నారు.

అయితే తాజాగా చిరంజీవికి కమల్ హాసన్ కౌంటరిచ్చారు. రాజకీయాల్లోకి రావద్దంటూ చిరంజీవి ఇచ్చిన సలహాపై స్పందించారు. గెలుపు ఓటముల కోసం తాను రాజకీయాల్లోకి రాలేదని కమల్ హాసన్ స్నష్టం చేశారు. ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికే తాను వచ్చానని చెప్పారు. నాకెప్పుడు చిరంజీవి సలహాలు ఇవ్వొద్దంటూ కమల్ వ్యాఖ్యానించారు.

ఇక మొన్నటి లోక్ సభ ఎన్నికల్లో తన ఓటమికి చాలా కారణాలు ఉన్నాయని.. ప్రజల ఆలోచన ధోరణిపై అవగాహన పెరిగిందని కమల్ హాసన్ చెప్పుకొచ్చాడు.