Begin typing your search above and press return to search.

ర‌జ‌నీది అదే స్ట‌యిల్‌..చెత్త‌బుట్ట‌లో వేయాల్సిందే

By:  Tupaki Desk   |   12 March 2018 5:31 PM GMT
ర‌జ‌నీది అదే స్ట‌యిల్‌..చెత్త‌బుట్ట‌లో వేయాల్సిందే
X
ఇటీవ‌లే `మ‌క్క‌ల్ నీది మ‌య్యం` పార్టీని ప్రారంభించిన క‌మ‌ల్ మాట‌ల్లో వాడి వేడి అసాధార‌ణ స్థాయిలో పెరిగింది. ప్రస్తుతం ప్ర‌జాయాత్ర‌లో ఉన్న ఆయ‌న త‌మిళ‌నాడు- ఎరోడ్ జిల్లాలో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా బ‌హిరంగ వేదిక‌ల‌పై జ‌నాల‌నుద్ధేశించి - అనంత‌రం జ‌రిగిన విలేక‌రుల స‌మావేశంలో ఆయ‌న కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. జాతీయ స్థాయి స‌మ‌స్య‌ల‌ను ప్ర‌స్తావిస్తూనే...త‌న స‌హ‌చ‌ర న‌టుడు - రాజ‌కీయ రంగ ప్ర‌వేశం చేస్తున్న‌ట్లు వెల్ల‌డించిన ర‌జ‌నీకాంత్‌ పై సెటైర్ వేశారు. కావేరీ జలాల గురించి ఓ జ‌ర్న‌లిస్టు ప్రస్తావిస్తూ ర‌జ‌నీ మౌనం వెనుక మ‌ర్మం ఏమిట‌ని ప్ర‌శ్నించారు.

దీనికి క‌మ‌ల్ త‌న‌దైన స్టైల్‌ లో స్పందించారు. కావేరీ జ‌లాలే కాకుండా ఇంకా అనేక విష‌యాల‌పై ఆయ‌న స్టైల్ అదేన‌ని ఎద్దేవా చేశారు. ఇక గూడ్స్‌&స‌ర్వీస్ ట్యాక్స్ పైనా క‌మ‌ల్ ఘాటుగా రియాక్ట‌య్యారు. జీఎస్టీ వ‌ల్ల అన్ని రంగాలు దెబ్బ తిన్నాయ‌ని, దీనిని చెత్త బుట్ట‌లో వేయాల‌ని క‌మ‌ల్ హాస‌న్‌ వ్యాఖ్యానించారు, రూ. 500 నోట్లు - 1000 నోట్లు ర‌ద్దు చేయ‌డం త‌ప్పు కాదు. కానీ దానిని స‌రైన ప‌ద్ధ‌తిలో అమ‌లుపర‌చ‌డంలో కేంద్ర‌ప్ర‌భుత్వం విఫ‌ల‌మైంద‌ని విమ‌ర్శించారు. యువ‌తరం వ్య‌వ‌సాయంలోకి రావాలి. ఇంజినీరింగ్ వ‌దిలి వ్య‌వ‌సాయం చేసేందుకు యూత్ ప్రాధాన్య‌త‌నివ్వాల్సి ఉంది. వ్య‌వ‌సాయ‌ రంగంలో అధునాత‌న ప‌ద్ధ‌తుల్ని ప్ర‌వేశ‌పెట్టాల్సి ఉంది“ అని వ్యాఖ్యానించారు. అలాగే చేనేత రంగంలో అంతా వృద్ధులే క‌నిపిస్తున్నారు. యూత్ ప్రవేశంతో ఈ రంగాన్ని కూడా మార్చ‌గ‌లమ‌ని అన్నారు. రాష్ట్రంలో తాగుడును త‌గ్గించాల‌న్నా ప్ర‌జ‌లు స్వ‌చ్ఛందంగా ముందుకు రావాల్సి ఉంటుందని, ప్ర‌భుత్వాల‌కే దానిని వ‌దిలేయ‌కూడ‌ద‌ని క‌మ‌ల్ పిలుపునిచ్చారు.