Begin typing your search above and press return to search.

క‌మ‌ల్ ను చూసైనా తెలుగు న‌టులు సిగ్గు ప‌డ‌రా?

By:  Tupaki Desk   |   17 Nov 2017 5:41 AM GMT
క‌మ‌ల్ ను చూసైనా తెలుగు న‌టులు సిగ్గు ప‌డ‌రా?
X
గ‌తంలో పోలిక‌లు త‌క్కువ ఉండేవి. సోష‌ల్ మీడియా పుణ్య‌మా అని ఒక‌రికొచ్చిన ఆలోచ‌న వాయు వేగంతో ఇప్పుడు అంద‌రి మ‌దిలోకి దూరిపోవ‌ట‌మే కాదు.. కొన్ని అయితే వైర‌ల్ గా మార‌ట‌మే.. పెద్ద చ‌ర్చ‌నే రేప‌టం ఎక్కువైంది. ఒక‌రి ఆలోచ‌న అంద‌రి ఆలోచ‌న‌గా మారిపోయేలా ప్ర‌భావాన్ని చూపిస్తోంది సోష‌ల్ మీడియా. తాజాగా మొయిన్ స్ట్రీమ్ మీడియాలో ప‌రిమితంగా వ‌చ్చిన ఒక వ్య‌వ‌హారం ఇప్పుడుమంట పుట్టిస్తోంది. ఈ మంట రానున్న రోజుల్లో మ‌రింత పెరిగే అవ‌కాశం ఉందంటున్నారు.

ఇంత‌కీ.. అంత‌లా మంట పుట్టించే అంశం ఏమిటంటారా? అక్క‌డికే వ‌స్తున్నాం. హార్వ‌ర్డ్ విశ్వవిద్యాల‌యానికి ప్ర‌ముఖ న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ రూ.20 ల‌క్ష‌లు ఇచ్చారు. ఇది త‌మిళుల్ని సంతృప్తిప‌రిచేలా చేస్తోంది. ఇది చూసిన తెలుగోళ్ల‌లో కొంద‌రికి మంట పుడుతోంది ఎందుకంటారా?.. అక్క‌డికే వ‌స్తున్నాం.

హార్వ‌ర్డ్ యూనివ‌ర్సిటీకి క‌మ‌ల్ హాస‌న్ విరాళంగా ఇచ్చిన రూ.20 ల‌క్ష‌లు.. ఆయ‌న అమ్మ‌భాష అయిన త‌మిళం అభివృద్ధి కోసం. హార్వ‌ర్డ్ వ‌ర్సిటీలో త‌మిళ భాష‌కు ఒక ప్ర‌త్యేక పీఠాన్ని ఏర్పాటు చేయ‌నున్నారు. దీనికి త‌న వంతు సాయంగా క‌మ‌ల్ హాస‌న్ రూ.20ల‌క్ష‌ల చెక్కును ఇచ్చేశారు. ఇంత‌టి భాషాభిమానాన్ని మ‌న తెలుగు న‌టుల్లో క‌నిపించ‌దే అన్న‌ది కొంద‌రి తెలుగోళ్ల కంప్లైంట్‌.

నాయ‌కులకు.. అధికారంలో ఉన్న వారికి అమ్మ భాష మీద ప‌ట్ట‌ద‌ని.. వారి సంగ‌తి ప‌క్క‌న పెడితే అదే భాష మీద బతుకుతూ.. కోట్లాది రూపాయిలు వెన‌కేసుకునే న‌టీన‌టులు సైతం భాష మీద దృష్టి పెట్ట‌రెందుకు? అన్న ప్ర‌శ్న‌ను సంధిస్తున్నారు. త‌మ‌కు లైఫ్ ఇచ్చిన అమ్మ‌ భాష‌కు ఎంతోకొంత సాయం చేయాల‌న్న ఆలోచ‌న త‌మిళ హీరోల‌కు ఉన్న‌ట్లుగా మ‌న‌కెందుకు ఉండ‌ద‌న్న‌ది ప్ర‌శ్న‌. భాషాదినోత్స‌వాల నాడు పెద్ద పెద్ద మాట‌లు మాట్లాడే రాజ‌కీయ నాయ‌కులు స‌ద‌రు వేదిక‌లు దిగిన వెంట‌నే తాము చెప్పిన మాట‌లు మ‌ర్చిపోతుంటారు. స‌మాజం మీద ప్ర‌భావం చూపించే సినీ న‌టులైనా క‌మ‌ల్ హాస‌న్ మాదిరి మాతృభాష కోసం కొంత టైంను.. కొంత డ‌బ్బును కేటాయిస్తే బాగుంటుంది. అమ్మ భాష‌ను బ‌తికించుకోవ‌టానికి.. ఆ భాష ఉన్న‌తి కోసం క‌మ‌ల్ మాదిరి రియాక్ట్ అయ్యే తెలుగు న‌టులు అస‌లు ఉన్నారంటారా?