Begin typing your search above and press return to search.
స్టాలిన్, ఉదయనిధిని కలిసిన కమల్ హాసన్
By: Tupaki Desk | 5 May 2021 8:33 AM GMTతమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కమల్ హాసన్ తేలిపోయారు. ఆయన తృటిలో ఓడిపోయారు. ఎన్నో ఆశలతో పార్టీ పెట్టి అసెంబ్లీ సీట్లు గెలిచి కింగ్ మేకర్ అవుదామని కలలుగన్న కమల్ హాసన్ ఆశలు నెరవేరలేవు.
అయితే ఆది నుంచి సెక్యూలర్ భావాలతో కమల్ హాసన్ బీజేపీని-అన్నాడీఎంకే కూటమిని వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలోనే అదే సెక్యూలర్ పార్టీ అయిన డీఎంకేకు పరోక్షంగా కమల్ మద్దతుగా ఉంటున్నారు. కానీ కలిసి పోటీచేయలేదు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే పార్టీ భారీ విజయాన్ని అందుకున్న నేపథ్యంలో తమిళనాడు ముఖ్యమంత్రిగా ఎం.కే స్టాలిన్ ఈ నెల 7న ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో మక్కల్ నీది మయ్యమ్ అధ్యక్షుడు, సినీ నటుడు కమల్ హాసన్ స్టాలిన్ ను కలిశారు. కాబోయే ముఖ్యమంత్రి స్టాలిన్ ను అభినందించారు. తొలిసారి అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగి విజయం సాధించిన స్టాలిన్ తనయుడు, హీరో ఉదయనిధిని కూడా కమల్ హాసన్ కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
కాగా, మూడేళ్ళ క్రితం కమల్ హాసన్ సొంత పార్టీ మక్కల్ నీది మయంను పెట్టాడు. తొలిసారి అసెంబ్లీ ఎన్నికల్లో భారీ ఆశలతో తన అభ్యర్థులను నిలబెట్టాడు, వాళ్ళెవరూ గెలవలేదు సరికదా, కమల్ సైతం ఓటమి పాలయ్యాడు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కోయంబత్తూర్ సౌత్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన కమల్.. బీజేపీ అభ్యర్థి వనతి శ్రీనివాసన్పై 1500 ఓట్ల తేడాతో ఓడిపోయారు.