Begin typing your search above and press return to search.

పార్టీ పాట‌ను విడుద‌ల చేసిన క‌మ‌ల్‌.

By:  Tupaki Desk   |   6 April 2018 8:18 AM GMT
పార్టీ పాట‌ను విడుద‌ల చేసిన క‌మ‌ల్‌.
X
ఈ మధ్యే రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తమిళ సూపర్‌ స్టార్ కమల్ హాసన్ త‌న రాజ‌కీయ దూకుడు పెంచుతున్నారు. ఫిబ్ర‌వ‌రి 21న మ‌ధురైలోని ఒత్త‌క‌డై గ్రౌండ్‌ లో ఏర్పాటు చేసిన భారీ బ‌హిరంగ స‌భ‌లో త‌న పార్టీ పేరుని ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ‘మక్కల్ నీధి మయ్యమ్’ గా పేరుని ప్రకటించిన‌ అనంతరం కమల్‌ హాసన్ పార్టీ జెండాను ఆవిష్కరించారు.అనంత‌రం ప‌లు చోట్ల సభ‌లు నిర్వ‌హించిన క‌మ‌ల్ తాజాగా పార్టీకి సంబంధించిన అఫీషియ‌ల్ సాంగ్ కొద్ది సేప‌టి క్రితం విడుద‌ల చేశారు. క‌మ‌ల్ ఈ పాట‌కి లిరిక్స్ అందించ‌డ‌మే కాకుండా ఓ పాట‌ కూడా పాడారు. విద్యాసాగ‌ర్ కంపోజ్‌ చేశారు. ప్ర‌స్తుతం ఈ సాంగ్ త‌మిళ‌నాట హ‌ల్ చ‌ల్ చేస్తుంది.

మక్కల్ నీధి మయ్యమ్ అంటే ప్రజా న్యాయ కేంద్రం (పీపుల్స్ జస్టిస్ సెంటర్) అని అర్థం. పార్టీ ద్వారా ప్ర‌జ‌ల‌కి సాయం చేయాల‌ని భావిస్తున్నానని చెప్పిన క‌మ‌ల్ తాను ప్ర‌జ‌ల నుండి స‌ల‌హాలు తీసుకుంటాన‌ని అన్నారు. మ‌రోవైపు కావేరీ బోర్డుపై నా క‌మ‌ల్ స్పందించారు. కావేరీ బోర్డు ఏర్పాటు చేయకపోతే సహాయ నిరాకరణోద్యమం చేస్తామని కమల్‌ హాసన్ కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ ఉద్యమం తమిళనాడు నుంచే ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. కావేరీ నదీ యాజమాన్య బోర్డు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలన్నారు. బోర్డు ఏర్పాటు విషయంలో కేంద్రం వైఖరి సరిగా లేదని విమర్శించారు. కావేరీ జలమండలి బోర్డు ఏర్పాటు చేయాలని గత కొద్దిరోజులుగా తమిళనాడులో అధికార అన్నాడీఎంకేతో పాటు పలు పార్టీలు - రైతు సంఘాలు నిరసన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.

వీడియో కోసం క్లిక్ చేయండి