Begin typing your search above and press return to search.

వ‌చ్చేశా.. నేను రాజ‌కీయాల్లోకి వ‌చ్చేశా

By:  Tupaki Desk   |   7 Nov 2017 11:21 AM GMT
వ‌చ్చేశా.. నేను రాజ‌కీయాల్లోకి వ‌చ్చేశా
X
ఒక‌రి త‌ర్వాత ఒక‌రుగా రాజ‌కీయాల్లోకి వ‌స్తున్న‌ట్లు చెబుతున్న సంగ‌తి తెలిసిందే. గ‌డిచిన కొన్ని వారాలుగా విల‌క్ష‌ణ న‌టుడు.. విశ్వ‌న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ రాజ‌కీయాల్లోకి వ‌స్తున్న వార్త‌ల‌తో పాటు.. ఆయ‌న క‌న్ఫ‌ర్మ్ చేయ‌టం తెలిసిందే. ఈ రోజు త‌న 63వ పుట్టిన‌రోజు జ‌రుపుకుంటున్న క‌మ‌ల్ హాస‌న్‌.. తాను రాజ‌కీయాల్లోకి వ‌చ్చేసిన‌ట్లేన‌ని ప్ర‌క‌టించారు. తాను రాజ‌కీయాల్లోకి వ‌స్తానా? రానా? అన్న సందేహం అక్క‌ర్లేద‌ని.. ఎందుకంటే తాను రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన‌ట్లుగా పేర్కొన్నారు.

పాలిటిక్స్ లోకి వ‌చ్చేశాన‌ని.. కొన్ని ప‌నులు మాత్ర‌మే పెండింగ్‌ లో ఉన్న‌ట్లుగా పేర్కొన్న క‌మ‌ల్‌.. తన పార్టీ వివ‌రాలు త్వ‌ర‌లోనే ప్ర‌క‌టించ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. త‌న బృందంతో క‌లిసి పార్టీకి సంబందించిన గ్రౌండ్ వ‌ర్క్ చేస్తున్నాన‌ని.. అందుకు సంబంధించిన స‌మావేశ‌మే ఈ రోజు నిర్వ‌హించిన‌ట్లు చెప్పారు.

పార్టీ ఏర్పాటుకు సంబంధించిన ప‌నులు దాదాపు పూర్తి అయ్యాయ‌ని.. కొన్ని ప‌నులు మాత్రం పెండింగ్ ఉన్న‌ట్లుగా ఆయ‌న చెప్పారు. రానున్న రోజుల్లో తాను త‌మిళ‌నాడు రాష్ట్రంలో ప‌ర్య‌టించాల‌ని భావిస్తున్న‌ట్లు చెప్పారు. స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం తాము ఒక యాప్ ను త‌యారు చేస్తున్న‌ట్లుగా చెప్పారు. వ‌య్యం విజిల్ పేరుతో యాప్‌ ను విడుద‌ల చేస్తున్నాన‌ని.. ఇది ప్ర‌జ‌ల కోసం.. వారి స‌మ‌స్య‌ల్ని నేరుగా తెలుసుకోవ‌టం కోస‌మేన‌ని చెప్పారు.

ప్ర‌స్తుతం త‌మ యాప్ టెస్టింగ్ ద‌శ‌లో ఉంద‌ని.. 2018 జ‌న‌వ‌రిలో ప్రారంభించ‌నున్న‌ట్లు చెప్పారు. త‌మ బృందం అన్ని జిల్లాల్లో మంచి ప‌నులు చేస్తోంద‌ని.. తాము చేస్తున్న సామాజిక కార్య‌క్ర‌మాల్ని అన్ని పార్టీలు ముచ్చుకుంటున్న‌ట్లు చెప్పారు. గ‌తంలో అవినీతికి పాల్ప‌డిన రాజ‌కీయ నాయ‌కుల‌ను తన పార్టీలోకి చేర్చుకోనంటూ స్ప‌ష్టం చేశారు క‌మ‌ల్ హాస‌న్.

తాను కూడా హిందువునేన‌ని.. తానెప్పుడూ హిందువుల మ‌నోభావాల్ని కించ‌ప‌ర్చుకోవాల‌ని అనుకోన‌న్నారు. హిందువునే అయినా తాను వేరే మార్గాన్ని ఎంచుకున్న‌ట్లు చెప్పారు. క‌ల‌ల నుంచే ఆవిష్క‌ర‌ణ‌లు వ‌స్తాయ‌ని.. అవే జీవితానికి మార్గం చూపిస్తాయ‌ని చెప్పిన క‌మ‌ల్ మాట‌లు ప్ర‌స్తుతానికి ఆస‌క్తిక‌రంగా ఉన్నాయ‌నే చెప్పాలి. మ‌రి.. ఆచ‌ర‌ణ‌లో ఆయ‌న ఎలా వ్య‌వ‌హ‌రిస్తారో చూడాలి.