Begin typing your search above and press return to search.

కమల్ హాసన్ ఇంటికి హోం క్వారంటైన్ నోటీసులు

By:  Tupaki Desk   |   28 March 2020 12:30 PM GMT
కమల్ హాసన్ ఇంటికి హోం క్వారంటైన్ నోటీసులు
X
అధికారుల పొరపాటుతో అభిమానులు ఆగమయ్యారు. ప్రభుత్వం అధికారుల చేసిన పొరపాటు వల్ల స్టార్ హీరోకు కరోనా సోకిందా అన్న భయం పాకింది. చెన్నైలోని ఆళ్వారుపేటలో ఉన్న ప్రముఖు సినీ నటుడు, రాజకీయ నాయకుడు అయిన కమల్ హాసన్ ఇంటికి చెన్నై కార్పొరేషన్ అధికారులు ‘కరోనావైరస్ రోగుల ఇళ్లకు అంటించే ఐసోలేషన్’ స్టిక్కర్ ను అంటించడం కలకలం రేపింది. దీంతో కమల్ కు కరోనా సాకిందా అని అభిమానులు, తమిళప్రజలు ఆగమాగం అయ్యారు.

అయితే దీనిపై పెద్ద దుమారం రేగడంతో కార్పొరేషన్ అధికారులు పొరపాటున అతికించామని.. కొన్ని గంటల వ్యవధిలోనే ఆ స్టిక్కన్లు తొలగించారు. చెన్నై నగర వ్యాప్తంగా 24వేల స్టిక్కర్లను అతికిస్తున్నామని.. ఈ క్రమంలోనే పొరపాటున కమల్ హాజన్ ఇంటికి అంటించారని కార్పొరేషన్ అదికారి తెలిపారు.

కాగా ఈ వివాదంపై కమల్ హాసన్ సైతం స్పందించారు. ఆళ్వారుపేటలోని తన ఇంట్లో తాను కొన్నేళ్లుగా నివసించడం లేదని.. పార్టీ సమావేశాల కోసం పార్టీ కార్యాలయంగా ఉపయోగిస్తున్నానని ట్విట్టర్ లో తెలిపారు. తాను కరోనా కారణంగా ఐసోలేషన్ లో ఉన్నానన్న వార్తల్లో నిజం లేదని కమల్ వివరణ ఇచ్చారు. ప్రజలంతా ముందుజాగ్రత్త చర్యగా సోషల్ డిస్టెన్స్ మెయింటేన్ చేయండి.. నేను ఇతరులకు దూరంగా ఉంటున్నా’ అని ట్వీట్ లో కోరారు.

ప్రస్తుతం కమల్ హాసన్ చెన్నైలోనే మరో ఇంట్లో ఒంటరిగా ఉంటున్నారు. ఆయన పెద్ద కూతురు శృతి హాసన్ ముంబైలో ఒంటరిగా తన ఫ్లాట్ లో ఉంటోంది. చిన్న కూతురు అక్షర చెన్నైలోనే మరొక ఇంట్లో ఉంటోంది.