Begin typing your search above and press return to search.
కాంగ్రెస్ తో పొత్తుపై కమల్ క్లారిటీ!
By: Tupaki Desk | 7 Aug 2018 10:53 AM GMTమాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం తమిళనాడు రాజకీయాలు రసకందాయంలో పడిన సంగతి తెలిసిందే. ``మక్కల్ నీది మయ్యమ్``పేరుతో సొంతపార్టీని లాంచ్ చేసిన విశ్వనటుడు కమల్ హాసన్ ....ఆల్రెడీ ప్రత్యక్ష రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. మరోవైపు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్....తన రాజకీయ అరంగేంట్రంపై పూర్తిగా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. బీజేపీకి తలైవా చేరువకాబోతున్నారని పుకార్లు వస్తుండగా....మరోవైపు....రజనీకి ఏఐడీఎంకే నేతలు గాలం వేస్తున్నట్లు వదంతులు వ్యాపిస్తున్నాయి. మరోపక్క డీఎంకే - ఏఐడీఎంకేలు...రాబోయే ఎన్నికల్లో గెలుపునకు శాయశక్తులా కృషి చేస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం సోనియా - రాహుల్ గాంధీలను కమల్ కలిసిన నేపథ్యంలో తాజాగా ఓ వార్త తమిళనాట హల్ చల్ చేస్తోంది. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ తో జత కట్టేందుకు కమల్ సంకేతాలిస్తున్నారని తమిళనాడు కాంగ్రెస్ అధ్యక్షుడు తిరునావుక్కరసర్...సోమవారం నాడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ భేటీ తర్వాత కమల్....చేస్తోన్న ప్రకటనల ద్వారా తమతో పొత్తుకు కమల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ నేపథ్యంలో ఆ వ్యాఖ్యలపై కమల్ స్పందించారు. కాంగ్రెస్ తో పొత్తు వార్తలను కమల్ ఖండించారు.
తమిళనాడులో డీఎంకే-కాంగ్రెస్ పొత్తు ఖరారైందని - టీటీవీ దినకరన్ నేతృత్వంలోని అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం -రాందాసు నేతృత్వంలోని పీఎంకే - తిరుమావళవన్ నేతృత్వంలోని వీసీకే పార్టీలు కూడా తమతో జత కట్టేందుకు రెడీ అయ్యాయని తిరునావుక్కరసర్ అన్నారు. కమల్ కూడా తమవైపు మొగ్గు చూపుతున్నారని, అందుకు సంకేతాలిస్తున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో ఆ వ్యాఖ్యలను కమల్ ఖండిచారు. ఆ ప్రకటన తిరునావుక్కరసర్ చేశారని....తాను కాంగ్రెస్ తో పొత్తు విషయంలో ఎక్కడా వ్యాఖ్యానించలేదని క్లారిటీ ఇచ్చారు. సోనియా - రాహుల్ లతో భేటీ అనంతరం కమల్....పొత్తులపై ఇప్పుడే మాట్లాడడం తొందరపాటవుతుందని మీడియాతో అన్న విషయం తెలిసిందే. మరోవైపు - మొదటి నుంచి బీజేపీకి వ్యతిరేకంగా కమల్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కమల్....కేరళ సీఎం పినరాయి విజయన్ - వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ - ఆప్ సీఎం కేజ్రీవాల్ లలతో భేటీ అయ్యారు.