Begin typing your search above and press return to search.

మెగాస్టార్ కి కౌంటర్ ఇచ్చిన కమల్..!

By:  Tupaki Desk   |   30 Oct 2019 9:10 AM GMT
మెగాస్టార్ కి కౌంటర్ ఇచ్చిన కమల్..!
X
రాజకీయ రంగం ..సినిమా రంగం ..ఈ రెండు రంగాల వారికీ చాలా దగ్గరి సంబంధాలు ఉంటాయి. వీరిది విడదీయరాని సంబంధం. సినిమా ఇండస్ట్రీలో ఎంతో గొప్ప స్టార్స్ గా ఒక వెలుగువెలిగిన వారు , ఆ తరువాత కాలంలో రాజకీయాలలో చేరినవారు చాలామంది ఉన్నారు. అయితే సినిమాలలో సక్సెస్ అయిన ప్రతి ఒక్కరు - రాజకీయాలలో సక్సెస్ అవుతారా అంటే దానికి సరైన సమాధానం ఎవ్వరం చెప్పలేం. ఎందుకు అంటే ..సినిమాలలో స్టార్స్ గా గొప్ప స్థానాలలో ఉన్నవారు రాజకీయాలలో కీలక పాత్ర వహించిన వారు ఉన్నారు..అలాగే రాజకీయాలలో ఘోరంగా ఫెయిల్ అయినవారు కూడా ఎంతో మంది ఉన్నారు.

అలాంటి వారిలో నందమూరి తారక రామారావు గారు ఒకరు ..సినీ స్టార్ గా అందరికి బాగా పరిచయం ఉన్న వ్యక్తిగా ఆంధ్ర ప్రజల ఆత్మగౌరవ నినాదం తో తెలుగుదేశం పార్టీ ని స్థాపించి కేవలం తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి వచ్చారు. ఇక టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రజాసేవ చేయాలనే లక్ష్యంతో ప్రజారాజ్యాన్ని స్థాపించారు కానీ , రాజకీయాలలో సక్సెస్ కాలేకపోయారు. దీనితో తాజాగా మెగాస్టార్ తన సహా నటులైన కమల్ హాసన్ - రజినీకాంత్ లకి రాజకీయాలు వద్దని సలహా ఇచ్చారు. ఈ విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

మెగాస్టార్ చేసిన ఈ వ్యాఖ్యలపై లోకనాయకుడు కమల్ హాసన్ తనదైన రీతిలో స్పందించారు. అందరికి తనకు జరిగిందే జరుగుతుంది అని అనుకోవడం తప్పు అంటూ చెప్పుకొచ్చారు. ఈ సలహా ఇంకెవరైనా ఇవ్వచ్చు కానీ - రాజకీయనేతగా పనిచేసిన చిరంజీవి ఇలా ఎలా చెప్పారు అంటూ ప్రశ్నించారు. ఎవరి అనుభవం వారికీ తగిన పాఠం చెప్తుంది అని చెప్పారు.