Begin typing your search above and press return to search.
దేశంలో కులం మతం లేని తొలి మహిళ !
By: Tupaki Desk | 18 Feb 2019 4:30 AM GMTవిలక్షణ నటుడు కమల్ హాసన్ ఏది చేసినా చాలా వెరైటీగానే ఉంటుంది. అది సినిమాల్లో అయినా - ఇటు రాజకీయ రంగంలో అయినా. తానే స్పెషల్ అనుకుంటే... తనకంటే స్పెషల్ అనిపిస్తే... అభినందించకుండా ఉండలేరు. ఇలాంటి ఘటనే ఇప్పుడు ఒకటి చోటుచేసుకుంది. ఆ కథాకమామీషు ఏమిటంటే... తమిళనాడుకు చెందిన యువతి స్నేహ పార్తీబరాజా.. దేశంలోనే కులం - మతం లేని తొలి వ్యక్తిగా నమోదైన సంగతి తెలిసిందే. ఈ మేరకు కుల - మతాలతో సంబంధం లేకుండా... ఏ కులానికి - ఏ మతానికీ చెందని వ్యక్తిగా ఆమె ఏకంగా ప్రభుత్వం నుంచి సర్టిఫికెట్ కూడా సంపాదించింది.
తమిళనాడులోని వేలూరు జిల్లా తిరుపత్తూరుకు చెందిన స్నేహ... బాల్యం నుంచి ఏ దశలోనూ తన కులం - మతం గురించి పేర్కొనలేదట. స్కూల్ - కాలేజి.. .ఇలా ఎక్కడా ఏ సర్టిఫికెట్ లోనూ ఆమె కులం - మతం కాలమ్స్ ను ఖాళీగా వదిలేసేది. కులం - మతం అటే గిట్టని ఆమె తల్లిదండ్రులు కూడా ఆమెకు మరింత ప్రోత్సాహం ఇచ్చారు. ఈ క్రమంలో విద్యాభ్యాసం పూర్తి చేసుకుని న్యాయవాద వృత్తిని ప్రారంభించిన స్నేహ... గతేడాది పార్తీబరాజాను వివాహమాడింది. అయితే ఇప్పటిదాకా ఆమెకు ఇలా కులం - మతం ప్రస్తావన లేకుండా ప్రభుత్వ ధ్రువీకరణ పత్రం లేదు. దీనికోసం ఆమె చాలా కాలంగా పోరాడుతోంది. ఈ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసిన ప్రతిసారీ... తాను ఏ కులానికి - మతానికి చెందిన దాన్ని కాదంటూ ఎంతో పకడ్బందీగా అర్జీ పెట్టుకునేది.
ఎన్నో ప్రయత్నాల మీదట ప్రభుత్వం ఆమెకు స్పెషల్ సర్టిఫికెట్ మంజూరు చేసింది. ఇప్పుడామె దేశంలోనే కులం - మతం లేని మొట్టమొదటి మహిళగా అధికారికంగా అవతరించింది. ఈ విషయం తెలుసుకున్న కమల్ హాసన్... ఆమెను మెచ్చుకోకుండా ఉండలేకపోయారు. ట్విట్టర్ వేదికగా స్నేహను అభినందిస్తూ కమల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కమల్ ట్వీట్ ఎలా సాగిందంటే.. *ప్రియమైన స్నేహా... భారతీయుల్లో చాలామందికి ఉన్న కోరికను మీరు నెరవేర్చుకున్నారు. శుభాభినందనలు. మతాన్ని నెట్టేద్దాం - కులాన్ని తోసేద్దాం... ఇక నుంచి మెరుగైన శుభోదయాన్ని ఆస్వాదిద్దాం... మంచి పని చేశావమ్మా* అంటూ స్నేహను కమల్ ఆకాశానికెత్తేశారు.