Begin typing your search above and press return to search.

ర‌జ‌నీని మ‌ళ్లీ కెలికిన క‌మ‌ల్

By:  Tupaki Desk   |   28 May 2017 12:36 PM GMT
ర‌జ‌నీని మ‌ళ్లీ కెలికిన క‌మ‌ల్
X
సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్‌ పై ప్ర‌ముఖ సినీన‌టుడు క‌మ‌ల‌ హాస‌న్ మ‌రోమారు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఇప్ప‌టికే రజ‌నీకి కెమెరాల షోకు ఎక్కువ‌ని, వాటి ముందు ఆరాటంతో రాజ‌కీయాల్లోకి వ‌స్తాను అంటూ ఆయ‌న హ‌ల్‌ చ‌ల్ చేస్తున్నార‌ని క‌మ‌ల్ వ్యాఖ్యానించిన సంగ‌తి తెలిసిందే. తాజాగా మ‌రో కామెంట్ చేశారు. ర‌జనీకాంత్ త‌న ప్ర‌సంగంలో త‌మిళ‌నాడు రాజ‌కీయాల గురించి ప్ర‌స్తావించ‌లేద‌ని అన్నారు. ఇప్ప‌టివ‌ర‌కు ఎన్నో దఫాల ప్ర‌సంగంలో రాష్ట్ర రాజ‌కీయాల గురించి ర‌జ‌నీ ప్ర‌స్తావించ‌లేద‌ని క‌మ‌ల హాస‌న్ వ్యాఖ్యానించారు.

డబ్బు సంపాదించుకునేందుకు రాజకీయాల‌ను వేదిక‌గా చేసుకోవ‌డం స‌రైంది కాద‌ని ప్ర‌జ‌లు గుర్తించాల‌ని క‌మ‌లహాస‌న్‌ న‌ర్మ‌గ‌ర్భ వ్యాఖ్యలు చేశారు. త‌మిళ‌నాడును ప‌రిపాలించేందుకు స్థానికుడే అయి ఉండాలా అనే మీడియా ప్ర‌శ్న‌కు క‌మ‌ల్ స్పందిస్తూ మ‌హాత్మాగాంధీ - జ‌వ‌హ‌ర్‌ లాల్ నెహ్రూ - సుభాష్ చంద్ర‌బోస్ వంటి ఎంద‌రో నాయ‌కులు ఉన్నార‌ని తెలుపుతూ వారికి ప్ర‌జ‌లు ఆమోద ముద్ర వేయలేదా అని ఎదురు ప్ర‌శ్నించారు.

ఇదిలాఉండ‌గా....క‌మ‌ల్‌ హాస‌న్‌, ర‌జ‌నీకాంత్ అభిమానుల మధ్య మాట‌ల యుద్ధానికి దారితీసింది. క‌మ‌ల్ హాస‌న్ కామెంట్స్‌ను ర‌జ‌నీ అభిమానులు త‌ప్పుబ‌డుతున్న‌రు. త‌మ అభిమాన హీరోకు ఉన్న ప్ర‌జాధ‌ర‌ణను ఓర్వ‌లేకే క‌మ‌ల్‌హాస‌న్ ఇలాంటి వ్యాఖ్య‌లు చేశారంటున్నారు. ఈ అంశం సోష‌ల్ మీడియాలో ట్రెండింగ్ అవుతుండ‌టం గ‌మ‌నార్హం. మ‌రోవైపు ర‌జ‌నీకాంత్ ఇక సినిమాల‌కు గుడ్‌ బై చెబుతున్నార‌నే వార్త కూడా వైర‌ల్‌గా మారింది. కాలా సినిమానే ఆయ‌న చివ‌రి సినిమా అని, దీని త‌రువాత ర‌జ‌నీకాంత్ పూర్తిగా రాజ‌కీయాల‌పై దృష్టి పెడ‌తార‌ని త‌మిళ‌నాడులో చ‌ర్చ జ‌రుగుతోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/